స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ( Tillu Square Movie ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కనకవర్షం కురిపిస్తోంది.ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా 45.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.తొలిరోజు ఏ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయో రెండో రోజు కూడా దాదాపుగా అదే స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
టిల్లూ స్క్వేర్ మూవీ రెండు రోజుల కలెక్షన్ల లెక్కల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.రెండు రోజుల కలెక్షన్లతోనే ఈ సినిమా చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది.
కేవలం 2 గంటల సినిమా కావడంతో మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ షోలు ప్రదర్శించే అవకాశం కూడా కలుగుతోందని తెలుస్తోంది.ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్( Star Maa ) సొంతం చేసుకుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్( Netflix ) ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంది.డీజే టిల్లు( DJ Tillu ) రైట్స్ ను ఆహా సొంతం చేసుకోగా టిల్లు స్క్వేర్ రైట్స్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.సిద్ధు జొన్నలగడ్డకు( Siddhu Jonnalagadda ) రైటర్ గా సైతం మంచి భవిష్యత్తు ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు.
టిల్లూ స్క్వేర్ కు సీక్వెల్ టిల్లూ క్యూబ్( Tillu Cube ) ఫిక్స్ కాగా ఈ సినిమా కథ కొంచెం స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టిల్లూ క్యూబ్ లో కూడా నేహాశెట్టి, అనుపమ పరమేశ్వరన్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది.ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటిస్తారో తెలియాల్సి ఉంది.ఈ సినిమాకు రవి ఆంటోని అనే మరో రైటర్ కూడా పని చేశారని భోగట్టా.