హీరోయిన్ అవకాశాలు లేక చివరికిలా?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ రేంజ్‌కు వెళ్లాలనే ఆశతో వచ్చి సరైన అవకాశాలు లేక ఫేడవుట్ అయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.వారిలో కొందరు అందంతో మెప్పించలేకపోతే, మరికొందరు నటనతో మెప్పించలేరు.

 Shraddha Das To Do Pro Stitute Role-TeluguStop.com

ఇంకొంత మంది రెండు ఉన్నా అదృష్టం లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు.కానీ అందం, అభినయం ఉన్న హీరోయిన్‌‌లకు కూడా అవకాశాలు రావని కొంతమందిని చూస్తే తెలుస్తోంది.

ఈ జాబితాలోకే చేరింది అందాల భామ శ్రద్ధా దాస్.హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, వరుసగా అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

దీంతో ఆర్య2, గుంటూరు టాకీస్, గరుడవేగ లాంటి సినిమాల్లో నటించినా అమ్మడిని ఎందుకో హీరోయిన్‌గా మాత్రం జనాలు ఒప్పుకోలేదు.దీంతో ఫోటోషూట్‌లలో అందాల ఆరబోతతో జనాలను ఆకట్టుకుంటూ వస్తోంది.

కాగా తాజాగా ఈమె ఓ సినిమాలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.అయితే ఇదేమీ హీరోయిన్ పాత్ర కాదు.

జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రద్ధాదాస్ ఓ వేశ్య పాత్రలో నటిస్తుందట.ఈ పాత్ర చాలా బోల్డ్‌గా ఉండటమే కాకుండా ముద్దుల వర్షం కురిపించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మరి ఈ వేశ్య పాత్రతోనైనా శ్రద్ధా దాస్‌కు మంచి గుర్తింపు లభించి అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube