టిడిపి అదినేత చంద్రబాబు( Chandrababu ) ఇక పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసే విషయంపై దృష్టి సారించారు .ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ముందుగానే అలెర్ట్ అవుతున్నారు .
తాను జైలుకు వెళ్ళకు ముందు వరకు పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి .తనతో పాటు పార్టీ క్యాడర్ కూడా నిరంతరం జనాల్లో ఉంటూ రావడం, తాను అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలన్నీ మూలన పడడం , ఏపీలో అధికార పార్టీ వైసిపి( YCP ) దూకుడుగా ప్రజల్లోకి ముందుకు వెళుతూ ఉండడం తదితర అంశాలు అన్నిటిని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు పార్టీని పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించేందుకు తాను కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాను రాజకీయ పర్యటనలు చేసినందుకు హైకోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు .

దీంతో పాటు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పని తీరు సక్రమంగా లేని వారిని పార్టీ పదవుల నుంచి తప్పించి , ఆస్థానంలో చురుకైన వారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారట. తాను జైలులో ఉండగా పార్టీ పరిస్థితి దిగజారడం, చాలామంది నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వంటి అన్నిటిని బాబు బేరీజు వేసుకుంటున్నారు.దీంతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న నాయుడు తన అరెస్టు సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో విఫలమయ్యారని పె, ద్దగా ఆందోళన కార్యక్రమాలు జరగలేదని, అంతేకాకుండా అనేకమంది అచ్చెన్న పై ఫిర్యాదులు చేయడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ టిడిపి అధ్యక్షుడిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారట.

అచ్చెన్న స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి( Yanamala Ramakrishna ) బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట.బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్న ను తప్పించినా, అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన యనమాలకు ఆ పదవి ఇస్తే పెద్దగా వ్యతిరేకత ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట. ఎలాగూ జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అండదండలు టిడిపికి ఉంటాయని, బీసీల్లో పట్టు సాధించగలిగితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి డోఖా ఉండదనే అంచనాలో బాబు ఉన్నారట.ప్రస్తుతం ఏ విషయాలపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు సమాచారం.