Shoaib Malik: ప్రేమ ఎంత గుడ్డిది…20 ఏళ్ల వయసులో షోయబ్ మాలిక్ ఒక అమ్మాయి చేతిలో ఇంత మోసపోయాడా?

షోయబ్ మాలిక్…( Shoaib Malik ) ప్రస్తుతం మూడో వివాహం చేసుకున్నాడని వార్తల్లో వైరల్ కంటెంట్ గా మారిపోయాడు.హైదరాబాద్ కి అల్లుడు అయినా షోయబ్ సానియా మీర్జా తో( Sania Mirza ) విడాకులు తీసుకున్నాడా లేడా అనే విషయంపై క్లారిటీ లేదు.

 Shoaib Malik First Marriage Cheating-TeluguStop.com

చాలా రోజులుగా వీరి మధ్య సయోధ్య లేదు అని వార్తలు మాత్రం వస్తున్నాయి.అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే షోయబ్ తన మూడో వివాహం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని పెళ్ళైన చేసుకోవచ్చు సయోధ్య కుదరకపోతే ఎన్నిసార్లైనా విడాకులు దొరకవచ్చు అయితే 20 ఏళ్ల వయసులోనే షోయబ్ మాలిక్ ని ఒక అమ్మాయి ఇంతలా మోసం చేసింది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

Telugu Ayesha Siddiqui, Cricketershoaib, Sana Javed, Sania Mirza, Shoaib Malik-M

2001లో 20 ఏళ్ల వయసులో పాకిస్తాన్( Pakistan ) కోసం క్రికెట్ ఆడుతున్న షోయబ్ మాలిక్కి ఒక ఫోన్ వచ్చింది అవతల వైపు నుంచి ఒక అమ్మాయి తన ఫ్యాన్ అంటూ మాట్లాడటం మొదలు పెట్టింది వారి మధ్య మాటలు కలిసాయి కొన్నాళ్లపాటు మాట్లాడుకోవడం జరిగింది ఒకరిపై ఒకరికి ఫీలింగ్స్ కూడా బాగానే వచ్చాయి అమ్మాయికి సంబంధించిన ఫోటోలను సైతం ఆమె షోయబ్ కి మెయిల్ ద్వారా పంపింది ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్( Love Proposal ) కూడా పెట్టింది తనను కూడా షోయబ్ మాలిక్ ఇష్టపడ్డాడు ఆమె పేరు ఆయేషా సిద్ధికి.( Ayesha Siddiqui ) సౌదీ అరేబియాలో ఉంటానని హైదరాబాద్ సొంత ప్రదేశమని అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటానని చెప్పింది.అదంతా నిజమే అని నమ్మాడు అమ్మాయి ఫోటోలో చాలా బాగుంది బాగా మాట్లాడుతుందని ప్రేమలో పడ్డాడు షోయబ్.

Telugu Ayesha Siddiqui, Cricketershoaib, Sana Javed, Sania Mirza, Shoaib Malik-M

అయితే కలవడానికి షోయబ్ మించిన ప్రతిసారి ఆమె నిరాకరించింది పెళ్లితోనే మనం ఒకటవ్వాలని చెబుతూ మభ్యపెడుతూ వచ్చింది.తన సోదరుని ఒకసారి షోయబ్ ని కలవడానికి కూడా పంపించింది.కానీ ఆమె మాత్రం రావడానికి నిరాకరించింది.అలా చాలా సార్లు కలవడానికి ప్రయత్నించిన ఆమె నిరాకరించడానికి కారణాలు తెలియలేదు కానీ ఒకసారి ఫోన్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని( Marriage ) బలవంత పెట్టింది.

పైగా తనతో గల రిలేషన్ అందరికీ తెలిసిపోయి వార్తలు బాగా పెరిగాయి అని కుటుంబం అందుకు చాలా ఇబ్బంది పడుతుందని త్వరగా పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని బలవంత పెట్టడంతో 20 ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడో అర్థం కాని షోయబ్ ఫోన్ లోనే నిఖా చేసుకున్నాడు.

Telugu Ayesha Siddiqui, Cricketershoaib, Sana Javed, Sania Mirza, Shoaib Malik-M

అయితే సౌదీ అరేబియాలో( Saudi Arabia ) ఒక టీచర్ తను షోయబ్ మాలిక్ భార్యను అంటూ చెబుతుందని తనకు తెలిసిన బంధువులు ఎవరో చెప్పగా ఆమె ఫోటోలు చూసి షాక్ అయ్యాడు అసలు ఆవిడ ఎవరో తెలీదు అని ఆయేషాకి ఫోన్ చేయగా విషయం అంత తెలిసిపోయింది.చాలా లావుగా ఉన్న తనకు బదులుగా అందంగా ఉన్న అమ్మాయి ఫోటోలు పంపి షోయబ్ ని మోసం చేయడంతో పాటు ఫోన్లో నిఖా చేసుకుని అతడు భార్యగా చలామణి అయింది.అందుకు ఆమె క్షమాపణలు చెప్పింది కానీ అతను భార్యగా ఆమెను అంగీకరించలేదు.

దాంతో విడాకులు తీసుకొని 2010లో సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు.ఇప్పుడు నటి సనా జావేద్( Sana Javed ) అనే అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube