వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( Ys Sharmila ) కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు .ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయాలని ఎంతగానో ప్రయత్నించినా సాధ్యపడలేదు.
అప్పట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వద్ద తీవ్రంగా వ్యతిరేకించారని , అందువల్లే వీలైన ప్రక్రియ నిలిచిపోయిందని ,చివరకు చేసేదిలేక షర్మిల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది.ఇప్పుడు కొత్త గా ఏర్పడిన రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి షర్మిల మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు ఆమె శుభాకాంక్షలు కూడా తెలియజేశారు .” పదేండ్ల నియంత పాలన నిలువునా పాతి పెడుతూ. మీ మీద నమ్మకంతో సరికొత్త ఆశలతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం.అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక మహత్తరఘట్టం .ఇది సుపరిపాలనకు నాంది అని మేం ఆశిస్తున్నాం.

ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నిబద్దత ,నిస్పాక్షిత కు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతుంది.ఇది నూటికి నూరు శాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకం ” అంటూ వ్యాఖ్యానించారు .ఇక సోషల్ మీడియా ద్వారా నూ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రకటన చేశారు .వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party ) తరఫున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళల సహకారం , మద్దతు ఉంటుంది.మనస్పూర్తిగా అందించడానికి మేము సిద్ధమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.
ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు మా శుభాకాంక్షలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా… కాంగ్రెస్( Congress ) తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తూ ఉండడం తో, తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందంటూ ఆమె వ్యాఖ్యానించడం వంటివి చూస్తుంటే.కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి కోసం షర్మిల ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే అసలు షర్మిల కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు రేవంత్ ఒప్పుకుంటారా… ముందు నుంచి షర్మిలను ఆ పార్టీ ని పక్కన పెట్టే విధంగానే వ్యవహరిస్తూ వస్తున్న రేవంత్( Revanth Reddy ) పూర్తిగా తన మార్క్ పాలన చేయాలని చూస్తున్న తరుణంలో.
షర్మిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వడం గానీ, ఆ పార్టీ మద్దతు తీసుకోవడం గాని చేయరనే అభిప్రాయాలు రేవంత్ సన్నిహితుల్లో వ్యక్తం అవుతున్నాయి.