డర్టీ పిక్చర్ ని డామినేట్ చేయలేకపోయిన షకీలా

సౌత్ ఇండియా సన్నీ లియోన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి షకీలా.అడల్ట్ సినిమాలతో మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకొని ఒకానొక సమయంలో అక్కడి స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చింది.

 Shakeela Biopic Talk, Tollywood, Bollywood, Richa Chadha, Actress Shakeel, Indra-TeluguStop.com

అలాగే మలయాళీ చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే అడల్ట్ ఇండస్ట్రీలోకి ఆమె కావాలని అడుగులు వేయలేదు.

తప్పనిసరి పరిస్థితిలో తల్లి ప్రోద్బలంతో కుటుంబ పోషణ కోసం చిన్న తనంలోనే రొమాంటిక్ అడల్ట్ పాత్రలు చేయాల్సి వచ్చింది.తరువాత ఆమెకి తిరుగులేని ఫేమ్ వచ్చింది.

సౌత్ ఇండియాలో షకీలా సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.అయితే ఎంతో సంపాదించిన షకీలా ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

కుటుంబానికి దూరమై ఒంటరిజీవితం గడుపుతుంది.సౌత్ ఇండియాలో బోల్డ్, అడల్ట్ యాక్టర్ షకీలా జీవితాన్ని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ సినిమాగా తెరకెక్కించాడు.

అదే టైటిల్ తో రిచాచద్దా హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది.క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Telugu Actress Shakeel, Bollywood, Richa Chadha, Shakeela Biopic-Movie

ట్రైలర్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇది సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్ తరహాలో అద్బుత విజయం అందుకుంటుందని అందరూ భావించారు.రొమాంటిక్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మిళితంగా ఉన్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అని, షకీలా జీవితంలో ఎవరికీ తెలియని కోణాలని ఇందులో చూపించబోతున్నారని అంటూ ప్రచారం జరిగింది.అయితే రిలీజ్ తర్వాత సినిమా పూర్తిగా తేలిపోయింది.

కంటెంట్ బాగున్నా, షకీలా పాత్రలో రిచాచద్దా ఒదిగిపోయి నటించిన, కథనంలో కన్ఫ్యూజన్ కారణంగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.దీంతో సినిమా ఎవరేజ్ టాక్ కి పరిమితం అయిపొయింది.

తన బయోపిక్ ని తెరపై చూసుకున్న షకీలాకి సినిమా చూసిన తర్వత సంతృప్తి ఇచ్చి ఉండొచ్చు కాని ప్రేక్షకులకి మాత్రం సంతృప్తి ఇవ్వలేదని చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube