ఇండియాకు మెడల్ తెస్తున్న తమన్నా  

Seetimaar Story Plot Revolves Around Tamannaah - Telugu Gopichand, Sampath Nandi, Seetimaar, Tamannaah

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘సీటీమార్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Seetimaar Story Plot Revolves Around Tamannaah

ఇక ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తున్నారు.అయితే ఈ సినిమా కథ మాత్రం తమన్నా చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో భారత్‌కు కబడ్డీలో గోల్డ్ మెడల్ తీసుకురావాలన్నది తమన్నా కోరిక.దీంతో ఆమె మహిళా కబడ్డీ కోచ్‌గా మారి తన కలను సాకారం చేసుకోవాలని చూస్తుంది.

ఈ క్రమంలో ఆమెకు గోపీచంద్ ఎలాంటి సాయం చేస్తాడు అనేది సినిమా కథ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో తమన్నా, గోపీచంద్‌లు తెలంగాణ మరియు ఏపీ కబడ్డీ జట్లకు కోచ్‌లుగా కనిపిస్తారు.

మొత్తానికి సంపత్ నంది ఈసారి పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.అయితే గతంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

మరి ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Seetimaar Story Plot Revolves Around Tamannaah Related Telugu News,Photos/Pics,Images..

footer-test