లీటర్ తేలు విషం అమ్మితే మీరే కోటీశ్వరులు... ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!

మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేయవచ్చు.అయితే అది అంత తేలికైన విషయం కాదనుకోండి.

 Scorpion Poison Costs 80 Crore Rupees Per Litre Details, Viral Latest, News Vira-TeluguStop.com

ఎందుకంటే తేళ్ల విషయానికి కొస్తే.ఇవి కూడా పాముల వలే విష జీవులు.

ఇందులో 2000 వరకు జాతులు ఉన్నాయని చెప్తారు.తేలు జీవన విధానం కూడా చాలా వింతగా ఉంటుంది.

ఏ వాతావరణంలోనైనా జీవించే తేలు సంవత్సరానికి ఒకసారి తింటే చాలట.ఇక అది సంవత్సరం పొడవునా ఆహారం లేకపోయినా బతికేస్తుంది.

అయితే ఈ తేలు యెక్క విషం ధర వింటే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

అవును, లీటర్ తేలు విషం 80 కోట్ల పైనే పలుకుతోందంటే మీరు నమ్ముతారా? ఒక చిన్న చుక్క కూడా ఇక్కడ ఎంతో విలువైంది.అందుకనే బేసిగ్గా టర్కీ ల్యాబ్‌లలో ఇటువంటి తేళ్లను విరివిగా పెంచుతున్నారు.తేలు విషం నుండి అనేకరకాల మందులు తయారు చేస్తారు.తేలు విషానికి మనలోని కొన్ని వ్యాధులను నయం చేసే శక్తి ఉంది కాబట్టే వాటికి అంత డిమాండ్ అన్నమాట.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషంగా చెబుతున్నారు.

ఒక టర్కిష్ ప్రయోగశాల స్కార్పియన్స్ నుండి రోజుకు 2 గ్రాముల విషాన్ని మాత్రమే సేకరిస్తుంది.

Telugu Crore Rupees, Poison, Latest, Poison Cost-Latest News - Telugu

ప్రత్యేక పద్ధతుల్లో ఈ విషాన్ని అక్కడ సేకరిస్తారు.ఆ తర్వాత విషాన్ని గడ్డ కట్టించి, పొడి చేసి విక్రయిస్తారు.తేలు జాతి యజమాని అయినటువంటి మెటిన్ ఓరిన్లర్ మాట్లాడుతూ.

తేళ్ల నుంచి సేకరించిన విషాన్ని ముందుగా గడ్డ కట్టి, గడ్డకట్టిన విషాన్ని పౌడర్‌గా మార్చి అమ్ముతామని చెప్పుకొచ్చారు.ఈ తేలు యొక్క విషాన్ని యాంటీబయాటిక్స్, సౌందర్య సాధనాలు, నొప్పి నివారణల తయారీలో ఉపయోగిస్తారని అన్నారు.

ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం వరకు ఉంటుంది.అంటే దాదాపు 300-400 తేళ్ల నుండి ఒక గ్రాము విషాన్ని మాత్రమే ఇక్కడ వారు సేకరించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube