నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే అంటున్న సంతోష్ శోభన్

ఏక్ మినీ కథ సూపర్ హిట్ తో కుర్ర హీరో సంతోష్ శోభన్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు.దీంతో అతనికి అవకాశాల వరుసగా క్యూ కట్టాయి.

 Santosh Sobhan's Next Titled Anni Manchi Sakunamule, Tollywood, Telugu Cinema, N-TeluguStop.com

వెంటవెంటనే ఏకంగా నాలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అందులో మారుతి దర్శకత్వంలో ఒక మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

గీతా ఆర్ట్స్ టులో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.అలాగే ఊహించని విధంగా టాలెంటెడ్ ఫిమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్లో అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు.అన్నీ మంచి శకునములే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా చిత్ర కథనం నందినిరెడ్డి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

Telugu Annimanchi, Nandini Reddy, Santosh Sobhan, Telugu, Tollywood-Movie

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం అందించనుండగా మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.మొదటి నుంచి మలయాళీ బ్యూటీ మాళవిక నాయర్ నందిని రెడ్డి దర్శకత్వంలో, అలాగే స్వప్న సినిమాస్ బ్యానర్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంది.ఈ నేపధ్యంలో సంతోష్ శోభన్ కి జోడీగా కూడా ఆమెనే రిపీట్ చేశారు.

వరుసగా తనకంటే ముందుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్టార్ కథానాయకులతో రొమాన్స్ చేసే అవకాశం సంతోష్ శోభన్ కి రావడం నిజంగా విశేషం.ట్టి ఒక సినిమాతో సంతోష్ శోభన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే విషయం దీన్ని బట్టి అర్థం అవుతుంది.

మరోవైపు యు.వి.క్రియేషన్స్ లో కూడా సంతోష్ మరొక మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube