సైరా టీంపై టీ ప్రభుత్వం ఆగ్రహం.. సెట్స్‌ కూల్చివేత

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో జరుగుతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున సెట్స్‌ నిర్మాణం చేసి ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుతున్నారు.

 Saira Narasimha Reddy Shooting Stopped By Ts Government-TeluguStop.com

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతున్న సెట్స్‌ను తెలంగాణ ప్రభుత్వ రెవిన్యూ శాఖ నేల మట్టం చేసింది.ప్రభుత్వంకు చెందిన భూమిలో సెట్స్‌ను నిర్మించారు అంటూ పదే పదే నోటీసులు ఇచ్చినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించని కారణంగా, సెట్స్‌ను పడగొట్టేశారు.

ప్రభుత్వ అధికారులు స్వయంగా రంగ ప్రవేశం చేసి ఆ సెట్‌ను కూలగొట్టేశారు.

సెట్‌ను కూలగొట్టడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడటం జరిగింది.దాంతో పాటు దాదాపు 30 లక్షలు వృదా అయ్యాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.భారీ ఎత్తున ఈ చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడంతో యూనిట్‌ సభ్యులు అంతా కూడా నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది.

ఈ భూ వివాదం ఏంటీ అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంపై మెగా ఫ్యామిలీ మరియు సినీ వర్గాల వారు కొందరు ఆగ్రహంతో ఉన్నారు.

మంత్రితో మాట్లాడేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాలేదు.కొంత సమయం కావాలని సైరా యూనిట్‌ సభ్యులు అడిగారని, కాని ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా సెట్స్‌ను కూలగొట్టారు అంటూ కొందరు అంటున్నారు.

చిరంజీవి 151వ చిత్రం అయిన సైరా నరసింహారెడ్డి షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి సంఘటన జరగడం కాస్త విచారకరం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటికే పలు సార్లు సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ లీక్‌ అవ్వడంతో పాటు, పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ చిత్రంకు సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ మొదట ఓకే చెప్పి, ఆ తర్వాత నో చెప్పడం, ఇంకా పలు కారణాలతో ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళనతో ఉన్నారు.ఈ సమయంలో ఇలా జరగడం అనేది చిత్ర యూనిట్‌ సభ్యులను కృంగదీస్తోంది.

ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ దాదాపు 150 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం ముందు ముందు మరెన్ని సమస్యలను ఎదుర్కొంటుందో చూడాలి.

వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.మరి అనుకున్నట్లుగా వీరు సైరాను విడుదల చేయగలరా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube