జగన్ రాజకీయం టీడీపీ ని ఇరకాటంలో పెట్టిందా ..

తేనె తుట్టులాంటి అత్యంత సున్నితమైన కాపు రిజర్వేషన్ అంశాన్ని టచ్ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ ప్రకటనతో అధికార పార్టీ టీడీపీని కూడా ఇరికించేశాడు.జగన్ ప్రకటనపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ టీడీపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది.

 Ys Jagan Puts Tdp In To Deep Trouble-TeluguStop.com

ఎందుకంటే గత ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ అంశం తెర మీదకు తీసుకొచ్చి ఆ తరువాత సైలెంట్ అయిపోయాడు.దీనిమీద కాపులు అనేక ఉద్యమాలు కూడా చేశారు.

వారందరి మీద అనేక కేసులు పెట్టి అణిచివేసేందుకు టీడీపీ ప్రయత్నించింది.తాజాగా జగన్ దీనిమీద తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో టీడీపీ దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

కాపులకు రిజర్వేషన్లపై తాను స్పష్టత ఇవ్వలేనని అది కేంద్రం పరిధిలోనిదని వై.ఎస్.జగన్ స్పష్టంగా చెప్పేసాడు.ఆ ప్రకటనతో చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగింది.

కాపులు ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలోనే.అవే ఉభయ గోదావరి జిల్లాలు.

గత ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలోనూ వైసీపీ తీవ్రంగా నష్టపోయింది.అయినా జగన్ కు వచ్చిన ఓట్లు తగ్గలేదు.

అంటే ఈ జిల్లాలు తనకు కలిసి రాకపోయినా మిగిలిన జిల్లాలోని బీసీలు , ఇతర కులాల వారు తన వెంట ఉంటే తనకు అధికారం ఖాయమనే భావనలో ఉన్నారు జగన్.

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలు చాలా నష్టపోతారు.

రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న కాపుల కోసం ఎక్కువ జనాభా అందులోనూ అధిక ఓట్లు ఉన్న ఇతర కులాలను ఆకర్షిస్తే తనకు మేలని జగన్ భావిస్తున్నారు.దీంతో జగన్ ఈ సరికొత్త వ్యూహానికి తెర తీశారు.

జగన్ ప్రకటనతో కాపుల నుంచి వ్యతిరేకత వచ్చినా … తన నిజాయితీ ప్రకటనతో పాటు బీసీలు ఇతర కులాలను తన వైపు తిప్పుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు.అన్నట్టుగానే బీసీఎలా నుంచి జగన్ కు సానుకూల పవానాలు వీచాయి.

ముద్రగడ పద్మనాభాన్ని నమ్ముకుని కాపులు ఉద్యమాలు చేస్తున్నారు.అయితే ఆయన ఎప్పుడు.

ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలియదు.

ప్రస్తుతం కాపు రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంకు వ్యక్తిగతంగా చరిష్మా తగ్గింది.ఏడాదికో పార్టీ మారే ముద్రగడ అంటే కాపుల్లో కూడా విశ్వాసం లేదు.రిజర్వేషన్ల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పాత చరిష్మా తెచ్చుకోవాలన్నది ముద్రగడ వ్యూహం.

జగన్ వేసిన ఈ సరికొత్త వ్యూహానికి తెలుగుదేశం అగ్ర నాయకులు సైతం గందరగోళ పడుతున్నారు.కాపులపై జగన్ చేసిన ప్రకటన తర్వాత బీసీ సంఘాల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube