రానా గొప్పతనం గురించి చెప్పిన సాయి పల్లవి

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలిగి ఉన్న అందాల భామ సాయి పల్లవి.చేసిన సినిమాలు తక్కువే అయినా అన్ని కూడా గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ వచ్చింది.

 Sai Pallavi Praise On Rana Daggubati, Tollywood, South Heroine, Gender Equality,-TeluguStop.com

ఈ కారణంగానే జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో ఉన్న మేల్ డామినేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మేల్ డామినేషన్ అనేది ఉంది.అయితే ఈ మధ్యకాలంలో నయనతార, అనుష్క లాంటి తారలు స్టార్ హీరోయిన్లుగా తమ టాలెంట్ ని సినిమాని నడిపిస్తూ, నిర్మాతలకి నమ్మకం కలిగిస్తున్నారు.

ఈ కారణంగానే ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంగా హీరో రానా వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపిస్తూ మార్కులు వేసేసింది.

విరాట‌ప‌ర్వంలో రానాతో క‌లిసి న‌టిస్తున్నాను.సినిమా ఒప్పుకునే ముందు కేవ‌లం సినిమాలో న‌టించ‌డం వ‌రకే నా బాధ్యత అని అనుకున్నాను.

కానీ సినిమా చేసేట‌ప్పుడు రానా ఎంత గొప్ప వ్య‌క్తో అర్థ‌మైంది.సాధార‌ణంగా హీరోల పేర్ల‌నే పోస్ట‌ర్స్‌పై వేయడాన్ని చూశాం.

విరాట‌ప‌ర్వంలో నా పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ను బట్టి త‌న పేరుతో పాటు నా పేరుని కూడా పోస్ట‌ర్స్‌పై వేస్తున్న‌ట్లు రానా తెలిపారు.రానా ఆలోచ‌న గొప్ప‌ది.

త‌నకి లింగ వివ‌క్ష‌త ఉండ‌దు.అంద‌రినీ స‌మానంగా చూస్తాడు.

త‌న‌లాంటి న‌టుడితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.అయితే రానాపై ఆమె ప్రశంసలు కురిపించడం ద్వారా ఇప్పటి వరకు చేసిన హీరోలలో జెండర్ ఈక్వాలిటీ చూపించే వ్యక్తిత్వం లేదని ఆమె చెప్పినట్లు అయ్యింది.

దీనికి సదరు హీరోల ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube