మీ ప్రేమ కోసమే వచ్చాను... మీకు ఏదైనా జరిగితే తట్టుకోలేము: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి తాజాగా నటించిన చిత్రం బ్రో ( Bro ).ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుంది.

 Sai Dharam Tej Speech At Bro Movie Trailer Launch Vizag,sai Dharam Tej,pawan Kal-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ పాటలు కూడా సినిమాపై బారీ అంచనాలను పెంచాయి.ఈ క్రమంలోని తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో పాటు వైజాగ్ లో కూడా లాంచ్ చేశారు.అయితే సాయి ధరంతేజ్ వైజాగ్ జగదాంబ థియేటర్ లో జరిగిన వేడుకలో హాజరయ్యారు.

Telugu Trailer, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakhani, Tollywood, Tr

ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మీ ప్రేమ పొందడం కోసమే నేను ఇంత దూరం వచ్చాను.మీ అందరికీ ఈ సినిమా ట్రైలర్ నచ్చడం చాలా సంతోషంగా ఉంది.రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ అభిమానులకు సూచించారు.

మీకు ఏదైనా జరిగితే మేము అసలు తట్టుకోలేము అని అభిమానులపై ప్రేమ కురిపించారు.అలాగే నాకు కొంచెం తిక్కుంది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్( Pawan Kalyan Dialogue ) చెబుతూ అందరిలో ఉత్సాహాన్ని కలిగించారు

Telugu Trailer, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakhani, Tollywood, Tr

ఈ విధంగా బ్రో సినిమా విడుదల తేదీ( Bro Movie Release Date ) దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనది ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా నటించడంతో సినిమాపై బారీ అంచనాలే పెరిగిపోయాయి.

ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాని తమిళ వినోదయసితం అనే సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక పర్యవేక్షణ వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube