కాంగ్రెస్ పార్టీ విజయసభకు విచ్చేయండి - మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయసభకు విచ్చేయండి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి తుక్కుగూడ లో ఆదివారం జరిగే విజయసభకు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి శనివారం పిలుపునిచ్చారు.

 Saddi Lakshma Reddy About Congress Party Meeting At Tukkuguda, Saddi Lakshma Red-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీకి అందరం రుణపడి ఉన్నామని ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రుణం తీర్చుకోవాలన్నారు.

రానున్న ఎన్నికల్లో 5 రకాల గ్యారెంటీ కార్డును సోనియా గాంధీ ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.

రైతు రుణమాఫీ, నాలుగు వేల పెన్షన్, 500 లకే సిలిండర్ తదితర అంశాలతో ప్రజల ముందటికి గ్యారెంటీ కార్డును తీసుకురావడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు దొమ్మాటి నరసయ్య, అనవేణి రవి, సోనవేని రాజయ్య, బాలయ్య, భూమి రెడ్డి, కటిక రవి, గుడ్ల శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మేడిపల్లి రవీందర్, ఎస్.కె గఫార్, ఎండి ఇమామ్, సిరిపురం మహేందర్, చెరుకు ఎల్లయ్య, వంగ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, నరేందర్ ,చెన్ని బాబు, గంట బుచ్చ గౌడ్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube