400 కిలోల బరువు ఎత్తబోయి కాళ్లు పోగొట్టుకున్న వెయిట్ లిఫ్టర్

చాలా మంది జిమ్ లలో వర్క్ అవుట్ చేసే సమయంలో అధిక బరువులు ఎత్తడం వలన ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.అలాగే జిమ్నాస్టిక్స్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో కూడా అదుపు తప్పి ప్రాణాలు కోల్పోయిన అథ్లెట్లు చాలా మంది ఉన్నారు.

 Russian Power Lifter Fractures Both Knees While, Weight Lifting, Power Lifter, E-TeluguStop.com

కొందరైతే ఇలాంటి ప్రమాదాల కారణంగా కెరియర్ ని అర్ధంతరంగా ముగించాల్సిన పరిస్థితి వస్తుంది.తాజాగా అలాగే ఓ వెయిట్ లిఫ్టర్ ఏకంగా నాలుగు వందల కేజీల బరువు ఎత్తే ప్రయత్నం చేసి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

కానీ ఈ ఘటన కారణంగా అతని రెండు మోకాళ్ళు పూర్తిగా దెబ్బ తినడం వలన కాళ్ళు పోగొట్టుకున్నాడు.మాస్కోలో జరిగిన వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్ షిప్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రష్యాకి చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ సెడిఖ్‌ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు.ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు.

అదృష్టవశాత్తు తాను ఎత్తిన బరువు వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అయితే సెడిఖ్‌ రెండు మోకాళ్లు విరగ్గా, తొడ కండరాలు కూడా దెబ్బతిన్నాయి.

వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అతడి కాళ్లకు శస్త్రచికిత్స నిర్వహించారు.రెండు నెలలపాటు అలెగ్జాండర్‌ మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది.రష్యాలో 2019లో వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.20 ఏళ్ల రడోస్కేవిచ్‌ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది.ఈ ఘటనకి సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బరువులు ఎత్తే క్రమంలో ఏ మాత్రం అత్యుత్సాహం చూపించిన జరిగే పరిణామం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ ఘటన రుజువు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube