చరణ్ ను రామరాజులా చూపిస్తే నార్త్ వాళ్లు రాముడిలా చూశారు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( Director SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి.

 Writer Vijayendra Prasad Sensational Comments On Ntr And Ram Charan Roles In R-TeluguStop.com

ఇప్పటి వరకు జక్కన్న 12 సినిమాలను తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అంతేకాకుండా ఒకదానిని మించి ఒకటి సినిమాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

కాగా రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్( RRR ) కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీగా కలెక్షన్స్ ను సాధించి రికార్డుల మోత మోగించింది.

Telugu Rajamouli, Ram Charan-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) ఆర్ఆర్ఆర్ లో హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.ఒక పాత్రను తక్కువ చేయడం.ఒక పాత్రను ఎక్కువ చేయడం కాదు.కథ రాసేటప్పుడు రెండు పాత్రలు ఒకేలా అనిపించాయి.

ఒకేలా అనుకునే రాశాము.కానీ, సినిమా చూసిన తర్వాత వేరేగా ఉంది.

ఈ మూవీలో రామ్ చరణ్ పాత్రలో చాలో వేరియేషన్స్ ఉంటాయి.ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది అని చెప్పారు.

ఎన్టీఆర్( Junior NTR ) గొప్ప నటుడు.

Telugu Rajamouli, Ram Charan-Movie

అతడి ఎలాంటి రోల్ ఇచ్చినా తినేస్తాడు.అయితే, ఆర్ఆర్ఆర్ మూవీలో పోషించిన పాత్ర చేయడం చాలా కష్టం.ఈ రోల్ కథను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్‌గా ఉంటుంది.

రామ్ చరణ్ పాత్రను రాముడిలా చూపించలేదు.రామరాజు లాగానే చూపించాము.

కానీ, అది శ్రీరాముడిలా( Lord Srirama ) వచ్చింది అని తెలిపారు విజయ్ విజయ్ ప్రసాద్.అలాగే రామ్ చరణ్‌( Ram Charan )ను రామరాజులా చూపిస్తే నార్త్ వాళ్లు నిజంగానే రాముడు వచ్చాడని అనుకున్నారు.

మేము ఆ ఉద్దేశంతో తీయకపోయినా మాకు అది కలిసి వచ్చింది.నా మీద కూడా ఆ రాముడి గెటప్ ప్రభావం చూపించిందేమో.

అందుకే నాకు ఆ పాత్ర ఎక్కువగా నచ్చింది అన్నారు విజయేంద్రప్రసాద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube