‘2.ఓ’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంత? లాభాలకు ఎంత రాబట్టాలో తెలుసా?  

శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా అక్షయ్‌ కుమార్‌ విన్‌గా నటించిన ‘2.ఓ’ చిత్రం విడుదల అయ్యింది. సంవత్సర కాలంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్బుతమైన విజువల్స్‌తో ఈ చిత్రంను శంకర్‌ హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. లైకా వారు ఈ మొత్తంను విడుదలకు ముందే రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ద్వారా 100% కోట్లను చిత్ర యూనిట్‌ సభ్యులు రాబట్టుకున్నారు.

Robo 2.0 Pre Release Business And Profits-Rajinikanth Robo Rs 100% Crore

Robo 2.0 Pre Release Business And Profits

ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా దక్కించుకోని క్రేజ్‌ను ఈ చిత్రం రాబట్టుకుంది. అందుకే అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రంకు భారీ క్రేజ్‌ ఉంది. ఇంత భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి పెట్టాలి అంటే దాదాపుగా 800 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయాల్సి ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగే వారు. కాని ఫలితం పాజిటివ్‌ గా ఉండటంతో లాభాలు ఏమో కాని పెట్టుబడి రికవరీ ఖాయం అంటున్నారు.

Robo 2.0 Pre Release Business And Profits-Rajinikanth Robo Rs 100% Crore

‘2.ఓ’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఇలా జరిగింది :
తమిళనాడు : 100 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 72
కర్ణాటక : 30 కోట్లు
కేరళ : 16 కోట్లు
నార్త్‌ ఇండియా : 77 కోట్లు
ఓవర్సీస్‌ : 80 కోట్లు
శాటిలైట్‌, ఆన్‌ లైన్‌ రైట్స్‌ : 180 కోట్లు
ఆడియో : 5 కోట్లు
మొత్తం : 100% కోట్లు