యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తాజాగా మరో సైమా అవార్డ్ ను( SIIMA Award ) సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.బెస్ట్ యాక్టర్ గా తారక్ తన ప్రతిభతో ఈ అవార్డును గెలుచుకున్నారు.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రకు ఈ అవార్డ్ వచ్చింది.జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు ఈ అవార్డ్ మరో నిదర్శనం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా జరిగిన సైమా ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కన్నడ హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) పాల్గొని అవార్డ్ అందుకున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంతూరు కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ అనే సంగతి తెలిసిందే.
తారక్ తెలుగుతో పాటు కన్నడ కూడా అనర్ఘళంగా మాట్లాడగలరు.దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది భాషలను అలవోకగా తారక్ మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇంగ్లీష్ లో సైతం అనర్ఘళంగా తారక్ మాట్లాడతారు.రిషబ్ శెట్టి తారక్ తో స్టేజ్ పై నుండి ఎలా ఉన్నారని కన్నడలో అడగగా తారక్ సైతం బాగున్నానని కన్నడలో( Kannada ) బదులిచ్చారు.ఆ తర్వాత మీరు ఎలా ఉన్నారని తారక్ రిషబ్ ను అడిగారు.ఆ సమయంలో యాంకర్ మీరు అమ్మ స్వస్థలానికి వచ్చినపుడు కన్నడలో మాట్లాడతారా అని అడగగా అవునని తారక్ బదులివ్వడం జరిగింది.
ఆ సమయంలో రిషబ్ మాట్లాడుతూ నేను మీకు డైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ అయితే రాలేదని కిరాక్ పార్టీ( Kirrak Party ) సమయంలో ఎన్టీఆర్ గారు నాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఇచ్చారని ఆ సమయంలో మీ అమ్మగారి ఊరు నా ఊరు ఒకటే అని అనిపించేదని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు.మీరు ఆంధ్ర వ్యక్తి అనే ఆలోచన సైతం నాకు రాలేదని రిషబ్ పేర్కొన్నారు.రిషబ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.