బిగ్ బాస్ సీజన్స్( Bigg Boss ) అన్ని బాగా చూసి వచ్చినవారు మాత్రమే కొన్ని తప్పులను కరెక్ట్ గా చేయగలరు.అందులో రతిక మంచి నాలెడ్జ్ తో ఉన్నట్టు ఉంది అందుకే కంటెంట్ క్రియేట్ చేయడానికి మొదటి నుంచి పడరాని పాట్లు పడుతుంది.
అందరు చేసింది నేను ఎందుకు చేస్తాను అన్నట్టుగా తాను మొదటి నుంచి సపరేట్ రూట్ లోనే వెళ్తుంది.నాగార్జున ఆమెను ఒక ఐఏఎస్ తో పోల్చడం తో రతిక( Rathika Rose ) తప్పులు చేయడం పెంచింది.
ఆమెలోని ఆత్మవిశ్వసం కూడా పరిధి దాటి పోయింది.అందుకు తాజాగా జరిగిన ఎపిసోడ్ లో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రెండు టీమ్స్ మధ్య అస్త్రం కోసం జరిగిన పోటీ లో రతిక టీమ్ ఓడిపోయినా గెలించిన టీమ్ లో ఒక సభ్యుడికి మాత్రమే అస్రం అందించే విషయం లో జరిగిన రచ్చ వల్ల అటు ఆమె తోటి టీమ్ మెంబర్స్ తో పాటు అవతల టీమ్ కూడా ఆమెపై విరుచుక పడ్డారు.చివరికి సందీప్( Aata Sandeep ) కూడా ఆమె పై కోపాన్ని చూపించాడు.
చూస్తున్న జనాలు కూడా రతిక పెట్టిన ఓపిక పరీక్షలో గెలవలేకపోయారు.ఆమె చాల మొండిగా ఆరవ స్థానంలో ఉండి తనకు నచ్చిన వ్యక్తికి అస్రాన్ని ఇవ్వాలని మొండిగా అందరికి వ్యతిరేఖంగా మారిపోయింది.ఇక ఇలా ఆమె ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం మొదటి సారి ఏమి కాదు.కంటెంట్ కోసం ఏమైనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తే ఎం ఎం చేయాలో ముందే డిసైడ్ అయినట్టుగా ఉంది.అందుకే హౌస్ లోకి అడుగు పెట్టగానే బిగ్ బాస్ చెప్పకపోయినా సరే సీక్రెట్ టాస్క్( Secret Task ) అంటూ అందరిని వెర్రిపప్పలను చేసింది.
ఇక మొదటి నుంచి పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ఆమెతో నడుచుకుంటున్న వ్యవహార శైలి తెలిసి కూడా అతడిని ఎంకరేజ్ చేసింది.కానీ ఒక్కసారిగా నామినేషన్ రోజు రివర్స్ అయిపోయి ప్రశాంత్ తో పాటు ఆట చూస్తున్న వారి ఫ్యూజులను పీకి పారేసింది.ఇక ఆమె రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) లవర్ అంటూ బయట ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అందుకు గల కారణం ఆమె తన ఎక్స్ లవర్ ని మిస్ అవుతున్నట్టుగా హౌస్ లో బాగా ప్రాజెక్ట్ చేసుకొని అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ఇలా కంటెంట్ కోసం అబ్బో రతిక మాములు వేషాలు వేయడం లేదు.