బ‌న్నీ-మ‌హేష్ కంటే రానానే టాప్‌     2017-03-03   22:45:33  IST  Raghu V

బాహుబలి సినిమాతో ఇండియావైజ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా. ఈ ఒక్క సినిమా రానాను ఇండియా స్టార్ చేసేసింది. రానా కెరీర్‌ను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. నిజానికి రానాకు తెలుగులో ఇటీవ‌ల వ‌చ్చిన ఘాజీ మిన‌హా చెప్పుకోద‌గ్గ సోలో హిట్ లేదు. అయినా రానా అటు త‌మిళ్‌, ఇటు తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో న‌టించి అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు.

ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ హీరోలు త‌మ సినిమాల‌ను సౌత్‌లో కీల‌క మార్కెట్ల‌లో ఒక‌టి అయిన త‌మిళ్‌లోకి అనువాదం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌న స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్‌బాబు డైరెక్టు తమిళ చిత్రంలో నటించేందుకు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్‌.లింగుస్వామి డైరెక్ష‌న్‌లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ద్విభాషా సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పాడు. ఆ సినిమా స‌డెన్‌గా ఆగిపోయింది.

ఇక మ‌హేష్ త‌న సినిమాల‌ను కోలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నా అవి స‌క్సెస్ కావ‌డం లేదు. ఇక మ‌హేష్‌బాబు తొలిసారిగా మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. తెలుగులో రానా కంటే క్రేజ్ ఉన్న వీరిద్ద‌రు త‌మిళ మార్కెట్‌లోను, త‌మిళ జ‌నాల్లో క్రేజ్ విష‌యంలోను రానా కంటే వెన‌క‌ప‌డి ఉన్నారు.

రానా ఇప్ప‌టికే త‌మిళ్‌లో అజిత్‌తో క‌లిసి ఆరంభం సినిమా చేశాడు. ఇక బాహుబ‌లితో ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది. తాజాగా ఘాజీ రానాకు అక్క‌డ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలే కాకుండా కోలీవుడ్‌లో రానా మడై తిరందు అనే డైరెక్టు తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక బాహుబ‌లి 2 కూడా అక్క‌డ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. సో ఓవ‌రాల్‌గా తెలుగు స్టార్ హీరోల‌కే త‌మిళ్‌లో సాధ్యం కాని క్రేజ్‌ను రానా సొంతం చేసుకున్నాడు.