డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక హీరో హీరోయిన్లుగా 2005వ సంవత్సరంలో నటించిన చిత్రం చంద్రముఖి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమాలో రజనీకాంత్(Rajinikanth ) హీరోగా నటించగా చంద్రముఖి పాత్రలో జ్యోతిక(Jyothika ) ఎంతో అద్భుతంగా నటించారు.అయితే ఈ సినిమా విడుదలైనటువంటి దాదాపు 17 సంవత్సరాలకు ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇక ఈ సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించగా జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా(Kangana )నటించారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా విడుదలైనటువంటి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రజనీకాంత్ చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ ఒక స్పెషల్ నోట్ రాశారు.రజనీకాంత్ రాసినటువంటి ఈ లెటర్ ను లైకా సమస్థ( Lyca Productions ) వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ లెటర్ లో రజనీకాంత్ ఏమని రాశారు అనే విషయానికి వస్తే.నా మిత్రుడు పి వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖి సినిమాని కొత్త యాంగిల్ లో భారీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా సినీ అభిమానులకు చంద్రముఖి 2 ద్వారా అందించాడు.
వాసు గారికి, రాఘవ లారెన్స్ గారికి, చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు.
ఈ విధంగా రజనీకాంత్ గారి నుంచి సర్ప్రైసింగ్ లెటర్ అందడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక రజనీకాంత్ రాసిన ఈ లెటర్ ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు.ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు.
అయితే కొన్నిచోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా మరికొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాపై భారీ స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి.చంద్రముఖి సినిమాని టైటిల్ మార్చి అలాగే తారాగణం మార్చి చంద్రముఖి 2 సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అంటూ మరికొన్ని చోట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.