ఆర్మూర్ లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుచ్చు టోపీ..!

ఆర్మూర్ లో( Armoor ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.రాజస్థాన్ కు చెందిన ఒక వ్యాపారస్తుడు కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్ లో ఉంటూ ప్రజలను నమ్మించి ఏకంగా రూ.10 కోట్లతో పరారీ అయ్యాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 Rajasthan Businessman Jump With 10 Crores In Armoor Details, Rajasthan Businessm-TeluguStop.com

వివరాల్లోకెళితే.ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో బీఆర్ఎస్ ( BRS ) నాయకునికి చెందిన ఆర్కే కాంప్లెక్స్ లోని( RK Complex ) కొన్ని షట్టర్లను రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అద్దెకు తీసుకొని వ్యాపారం నిర్వహించుకునే వాడు.

దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉండి వ్యాపారం నిర్వహిస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖులతో పరిచయం ఏర్పడింది.ఇక ప్రముఖులు, ఫైనాన్షియర్ ల నుంచి డబ్బు అప్పు తీసుకొని నమ్మకంగా చెల్లించేవాడు.

Telugu Armoor, Rk Complex-Latest News - Telugu

ఇలా ఆర్మూర్ నగరంలో ఉండే అందరూ ఫైనాన్షియర్ల వద్ద, తెలిసిన ప్రముఖుల వద్ద మొత్తం ఏకంగా రూ.10 కోట్ల వరకు డబ్బు అప్పు తీసుకున్నాడు.అయితే తాజాగా రాజస్థాన్ వ్యాపారి( Rajasthan Businessman ) ఇంటికి, షటర్లకి తాళాలు వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు.కొన్ని రోజుల తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తులు షట్టర్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనించారు.

దీంతో అనుమానం వచ్చిన ఫైనాన్స్ వ్యాపారులు రాజస్థాన్ వ్యాపారికి ఫోన్ చేస్తే, ఆర్మూర్ లోని కొందరు వ్యక్తులు తనను బెదిరించారని అందుకే ఆర్మూర్ విడిచి వెళ్లానని చెప్పాడు.కొన్ని రోజులకు ఎవరు ఫోన్ చేసినా రాజస్థాన్ వ్యాపారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తమను ముంచి పారిపోయారని తేలింది.

Telugu Armoor, Rk Complex-Latest News - Telugu

ఆర్మూర్ నగరంలో ఉండే దాదాపు 60 మంది వ్యక్తుల నుంచి రూ.5 లక్షల నుండి రూ.75 లక్షల వరకు మొత్తం సుమారు రూ.10 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఏ ఫైనాన్స్ వ్యాపారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.ఇల్లీగల్ ఫైనాన్స్ ల వల్లనే ఫిర్యాదు ఇచ్చేందుకు ఫైనాన్స్ వ్యాపారాలు జంకుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆర్మూర్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube