మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ దర్యాప్తు పూర్తి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది.

ఈ హత్య కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ జరిపింది.

ఈ క్రమంలో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించింది.హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డిలు న్యాయస్థానం ఎదుట హాజరుకాగా దస్తగిరి గైర్హాజరు అయ్యారు.

ఈ క్రమంలో ఆరుగురు నిందితులకు కోర్టు జూలై 14 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే దర్యాప్తును పూర్తి చేసిన సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది.

మరోవైపు హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది.జూలై 3న సుప్రీంలో జరిగే విచారణలో కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వెల్లడించనుంది.

Advertisement
సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్

తాజా వార్తలు