Mahesh Babu Rajamouli : రాజమౌళి సినిమాకి మహేష్ బాబు ఇవ్వబోతున్న డేట్లు ఎన్నో తెలుసా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందబోతున్న మహేష్‌ బాబు సినిమా కు సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి.ఇప్పటికే మహేష్ కి సరిగ్గా సెట్ అయ్యే ఒక అడ్వెంచర్ కథ ను దర్శకుడు రాజమౌళి ఓకే చెప్పాడట.

 Rajamouli And Mahesh Babu Movie Interesting Update ,  Mahesh Babu,rajamouli ,rrr-TeluguStop.com

విజయ ప్రసాద్ అద్భుతమైన ఒక యాక్షన్ అడ్వెంచర్ కథ ను రెడీ చేశాడని.రాజమౌళి దానిని తనకు తగ్గట్టుగా మార్చుకొని తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం అందుతుంది.

మొన్నటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా యొక్క ప్రమాషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్న జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోతున్న సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అవ్వబోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

Telugu Mahesh Babu, Rajamouli, Trivikram-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపుగా 250 రోజులు డేట్స్ ని కేటాయించాడట.రాజమౌళి సినిమా కనుక మరో 50 నుండి 70 రోజులు అదనం గా మహేష్ బాబు డేట్ లు ఇవ్వాల్సి వస్తుంది అంటూ టాక్‌ వినిపిస్తుంది.దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

రాజమౌళి సినిమా అంటే కేవలం ఇండియన్ ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.కనుక ఈ సినిమా మరో లెవల్లో ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ సినిమా ను రూపొందించబోతున్నట్లుగా ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు.ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

కానీ ఖచ్చితంగా దేశం మొత్తం గుర్తింపు ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.రాజమౌళి తో సినిమా చేస్తున్నన్ని రోజులు కూడా మహేష్ బాబు మరే సినిమా కు కమిట్ అవ్వకుండా ఉంటాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube