ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది .మొన్నటి వరకు టిడిపి టార్గెట్ గా అధికార పార్టీ వైసిపి అనేక ఎత్తుగడలు వేస్తూ, పార్టీని బలహీనం చేస్తూ, ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుంటూ హడావుడి చేసింది.
వైసీపీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ తెలుగుదేశం పార్టీ లో తీవ్ర ఆందోళన నెలకొంది.పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు వెళ్ళిపోతూ ఉండడం వంటి పరిణామాలు కలవరం కలిగించాయి.
ఇది ఇలా కొనసాగుతుండగానే, ఆకస్మాత్తుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ, అనేక విమర్శలు చేయడం జరిగిన సంగతి తెలిసిందే.ఆయనపై అనర్హత వేటు వేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది.
ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం కు చెందిన సొంత పార్టీ, ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రి శ్రీరంగనాథరాజు రఘురామకృష్ణరాజు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించిన వ్యవహారం పై వివాదం చెలరేగింది.
ఎంపీ రఘురామకృష్ణం రాజు మంత్రి రంగనాథ రాజు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పిఏ సురేష్ పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, అసలు రఘురామ కృష్ణంరాజు సొంత నాయకులను తిట్టడం, వారు తిరిగి రఘురామకృష్ణరాజు తిట్టడం కొద్ది రోజులుగా జరుగుతూనే ఉండగా, అకస్మాత్తుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు ఎంపీ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వెనుక కారణాలేంటి అనే సందేహాలు అందర్లోనూ నెలకొన్నాయి.అయితే త్వరలో ఏపీ క్యాబినెట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.
ఈ మార్పుచేర్పులు రంగనాథ రాజును తప్పిస్తారు అనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది .ఈ నేపథ్యంలోనే ఎంపీ వివాదంలో తలదూర్చడం ద్వారా, అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయవచ్చు అనే అభిప్రాయంతో ఈ ఎత్తుగడ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై మంత్రి అనుచరులు మాత్రం ఇప్పటికే రఘురామకృష్ణంరాజు మంత్రిపై విమర్శలు చేయడం లో లిమిట్స్ దాటారు అని, ఆ విమర్శలు శృతిమించడంతో నే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ వలసి వచ్చిందని చెబుతున్నారు.ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గం నాయకులు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, విమర్శించుకోవడం వంటి పరిణామాలు ఆ సామాజిక వర్గం నేతలకు మింగుడు పడడం లేదు.ఈ వ్యవహారం ఇప్పుడు ఎక్కడ వరకు వెళుతుంది అనేది చూడాలి.కాకపోతే మంత్రి పీఏ ఇచ్చిన ఫిర్యాదు ను ఇంకా పెండింగ్ పెట్టడంతో రఘు రామ కృష్ణం రాజు పై కేసు నమోదు చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.