టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా లారెన్స్ కు ( Lawrence ) ప్రత్యేక గుర్తింపు ఉంది.లారెన్స్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నటులలో ఒకరు కావడం గమనార్హం.
లారెన్స్ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.ముని సిరీస్ లో భాగంగా లారెన్స్ నటించిన సినిమాలు అన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను అందించాయి.
లారెన్స్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల( Social Service ) కొరకు ఖర్చు చేస్తున్నారు.
నిరుపేద మహిళకు( Poor Woman ) లారెన్స్ సహాయం చేయగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగమ్మాళ్ అనే మహిళకు బాల, లారెన్స్ సహాయం అందించారు.పెళ్లైన కొన్నేళ్లకే భర్తను కోల్పోయిన ఆమెకు తన ముగ్గురు కూతుళ్లను పోషించడం కష్టంగా మారింది.
కూతుళ్లను పోషించడం కోసం ఆమె రైలులో సమోసాలను విక్రయిస్తోంది.
ఆటో డ్రైవింగ్( Auto Driving ) కూడా వచ్చినా ఆటో కొనడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ విషయాలు తెలిసి బాల, లారెన్స్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.ఆ మహిళకు లారెన్స్ 3 లక్షల రూపాయల సహాయం చేయగా ఆ మొత్తంతో కొత్త ఆటో కొన్నారు.
కొత్త ఆటోను చూసి మురుగమ్మాళ్ ఎమోషనల్ కావడం గమనార్హం.లారెన్స్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేస్తే ఆ సహాయం వాళ్ల జీవితాలనే మార్చేస్తుందని చెప్పవచ్చు.కమెడియన్ బాల( Comedian Bala ) సైతం కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేయడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.లారెన్స్ లా ఇతర సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు సాయం చేస్తే ఎంతోమంది పేదవాళ్ల జీవితాలు మారతాయని చెప్పవచ్చు.లారెన్స్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.