బాసరలో సరస్వతి కోవెలలో కొండచిలువ కలకలం..!

శ్రావణమాసం తొలి శనివారం అందులో నాగుల పంచమి కావడంతో ఆయలంలోకి వచ్చిన కొండచిలువ రాక కలకలం రేపింది.అంతేకాకుండా కొండచిలువ లింగాకారంలో కనిపించడంతో దేవాలయానికి వచ్చిన భక్తులు అంత నమస్కరించుకున్నారు.

 Basara, Saraswathi Temple, Pythn ,python Entered In Basara Saraswati Temple, Nag-TeluguStop.com

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులు కొండ చిలువకు పాలు పోసి నాగుల పంచమిని జరుపుకున్నారు.ఈ సంఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తీ వివరాల్లోకి వెళ్తే.నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో కొండచిలువ కలకలం సృష్టించింది.ఆలయంలోని అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం ముందు కొండ చిలువ దర్శనం ఇచ్చింది.కొండచిలువ పొడవుగా, ఉదర భాగం లావుగా ఉండడం గమనార్హం.

భక్తులు ఈ దృశ్యాన్ని చూసి శుభసూచకంగా భావించారు.

అయితే శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ కనిపించిందని అందరు దండం పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా వారు కొండ చిలువకు భక్తులు పాలు పోశారు.అనంతరం పూజలు కూడా చేశారు.ఆలయ సిబ్బందికి ఈ విషయం చేరవేయడంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు.వారు ఆలయంలోని కొండ చిలువను బంధించి తీసుకెళ్లిపోయారు.

మరో అరుదైన సన్నివేశం ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలోని స్థానికుల కంట పడింది.నాగుల పంచమి నాడు రెండు నాగు పాములు సయ్యాటలాడుకుంటున్నాయి.అక్కడే ఉన్న ఓ చెక్‌ డ్యాం వద్ద ఈ దృశ్యం చోటు చేసుకుంది.శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా దీన్ని తిలకించారు.

మరికొంత మంది ఔత్సాహికులు ఈ సన్నివేశాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube