టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకుని ఆయన ఎన్నో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నాడు.
అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ మొదలైన సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ” పూరి మ్యూజింగ్స్ ” అనే పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను నెటిజెన్స్ కు తెలుపుతున్నాడు.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన వివిధ రకాల అంశాలపై మాట్లాడిన విషయం తెలిసిందే.
మరోసారి ఆయన వేట అనే అంశం గురించి మాట్లాడారు.ఇందులో భాగంగానే మంగళవారం మంచిది కాదని ఓ కుక్క ను కన్విన్స్ చేయడం.అలాగే శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేస్తే స్వర్గానికి వెళ్తామని కోతికి నచ్చచెప్పలేం అంటూ చెబుతూనే ప్రపంచంలో ఏ జంతువు ఫిక్షన్ కల్పిత కథలను నమ్మదు అని తెలిపాడు.జంతువులు కేవలం వాస్తవాలను మాత్రమే నమ్ముతాయి అని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా బూడిద పూస్తే దయ్యం రాదని అంటే మనం నమ్ముతాం… అలాగే ఓ రాయిని తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రపంచాన్ని ఏలుతాం అది కూడా నమ్ముతారు అంటూ తెలుపుతూనే మనిషి వేటగాడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు అని తెలిపాడు.
మనిషి ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయంని కనిపెట్టాడు.
ఆ తర్వాత వేట మానేసాడు.ఇప్పుడు ఇంటి చుట్టూ పంట చేతిలో కొంచెం అని చెబుతూనే మనిషికి పని తగ్గింది కల్పిత కథలు మొదలయ్యాయి వాటిని వినడమే కాదు నమ్మడం కూడా మొదలుపెట్టాం చెప్పుకొచ్చాడు.
ఇలా చేయడం వల్లే మనకు దరిద్రాలు మొదలయ్యాయి అని చెప్పుకొచ్చాడు.నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా అన్నట్లుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పటికీ జంతువులు నిజంలో బతుకుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.జంతువులు ఏమో నిజంలో బతుకు ఉంటే, మనుషులు మాత్రం అబద్దం లో బతుకుతున్నాం అంటూ చెప్పాడు.
కంచంలో కి ఉచితంగా భోజనం వచ్చినప్పుడు రోజులు ఇలాగే ఉంటాయని, కానీ వేటగాడు మాత్రం ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటాడు అని తెలిపాడు.ఇక చివరగా మీరు వేట మానొద్దు… మీరు ఊర్లో ఉండవద్దు… అంటూనే కడుపు నిండిన వాడి పక్కన అసలు కూర్చోవద్దని పూరి ఈ సారి వేట అనే టాపిక్ ను ముగించారు.