మామిడి తోటల సాగు ప్రారంభంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

మామిడి తోటల సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు ముందుగా మామిడి పంట సాగుపై పూర్తి అవగాహన కల్పించుకోవాలి.అప్పుడే పంటలలో తలెత్తే ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

 Precautions To Be Taken At The Beginning Of Cultivation Of Mango Plantations , M-TeluguStop.com

మామిడి తోటల సాగు( Cultivation of mango plantations ) విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గతంలో ఒక ఎకరం పొలంలో దాదాపుగా 50 మొక్కలు మాత్రమే నాటుకొని సాగు చేసేవారు.

కానీ వ్యవసాయ రంగంలో అనేక మార్పులు జరిగాయి.ప్రస్తుతం ఒక ఎకరంలో దాదాపుగా 160 మొక్కలను నాటుకొని సాగు చేయవచ్చు.

ఇక మొక్కలు నాటుకోవడానికి జూన్ నుండి డిసెంబరు వరకు చాలా అనుకూలమైన సమయం.మొక్కలు నాటిన మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం మొదలవుతుంది.

మామిడి సాగుకు చౌడు, ఉప్పు, బరువైన నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండవు.ఇవి కాకుండా అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి.

ఆయా ప్రాంతాల మార్కెట్ డిమాండ్లు దృష్టిలో పెట్టుకొని మామిడి రకాలను ఎంపిక చేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చు.

Telugu Agriculture, Cattle Manure, Mango, Latest Telugu-Latest News - Telugu

ఇక మొక్కలు విషయానికి వస్తే ఆరోగ్యమైన నాణ్యమైన అంటూ మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఈ మొక్కలు కనీసం 8 నెలలు నర్సరీలో పెరిగి ఉండాలి.ఈ మొక్కలలో వేరుమూలం, సయాను బాగా అతికి ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.

ముఖ్యంగా వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఇక నాటుకునే విషయానికి వస్తే ఒక ఎకరం పొలంలో 7.5*7.5 మీటర్ల ఎడంతో నాటితే 71 మొక్కలు నాటుకోవచ్చు.5*5 మీటర్ల ఎడంతో నాటితే 160 మొక్కలు నాటుకోవచ్చు.

Telugu Agriculture, Cattle Manure, Mango, Latest Telugu-Latest News - Telugu

ఇక మామిడి సాగులో కీలకం గుంతలు తవ్వుకోవడం.ఒక మీటరు వెడల్పు, పొడవు, లోతు ఉండేటట్లు గుంతలు తవ్వి అందులో 50 కిలోల పశువుల ఎరువు( Cattle manure ), రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 120 గ్రాముల ఫాలిడాల్ పొడి వేసి గుంతలు నింపాలి.అ గుంతలో మొక్కను నాటుకోవాలి.

మొక్క నాటే సమయంలో వేర్లు కదలకుండా, లోపలికి గాలి పోకుండా మట్టిని గట్టిగా నొక్కి మొక్క కదలకుండా చిన్న కొయ్య పాతి మొక్కలు నాటాలి.నాటిన వెంటనే ఒక నీటి తడి అందించాలి.

ఇక వాతావరణంలో వర్షాల పరిస్థితులను బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.సాధారణ పద్ధతిలో కాకుండా ట్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తే పొలంలో కలుపు మొక్కల సమస్య ఉండదు.

ఇక మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం ప్రారంభం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube