ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను( Prabhas Srinu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఊహించని స్థాయిలో టాలెంట్ ఉన్న నటులలో పభాస్ శ్రీను ఒకరు.
ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ కృష్ణంరాజు నాకు దేవుడని సరదాగా ఉండేవాళ్లంటే ఆయన ఎంతగానో ఇష్టపడతారని చెప్పారు.కృష్ణంరాజు గారు అంటే పిచ్చిప్రేమ అని ప్రభాస్ శ్రీను అభిప్రాయం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు, ప్రభాస్( Krishnamraj, Prabhas ) ఎంతో గొప్ప వ్యక్తులు అయినా సింపుల్ గా ఉంటారని కృష్ణంరాజు గారి మృతి తీరని లోటు అని ప్రభాస్ శ్రీను అభిప్రాయం వ్యక్తం చేశారు.కృష్ణంరాజు గారు యువరాజు కావడంతో నన్ను మంత్రి అని పిలిచేవారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
కృష్ణంరాజు గారు నవ్వుతూ సరదాగా నవ్విస్తూ ఉండేవారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.కృష్ణంరాజు గారి వాయిస్ ను ఇమిటేట్ చేయడం సులువు కాదని ఆయన తెలిపారు.
ప్రభాస్, కృష్ణంరాజు తనకు దేవుళ్లు అనే అర్థం వచ్చేలా ప్రభాస్ శ్రీను కీలక వ్యాఖ్యలు చేశారు.కృష్ణంరాజు గారు అంటే భయం, భక్తి అని ఆయన కామెంట్లు చేశారు.మనిషి అనేవాడు తప్పు చేస్తాడని ఎప్పుడో ఒకసారి కోపం వస్తుందని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.ప్రభాస్ గారి మూడ్ కు అనుగుణంగా ముందడుగులు వేస్తానని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
మనం ఉన్నప్పుడు ఒకలా మనం లేనప్పుడు మరోలా మాట్లాడేవాళ్లు చాలామంది ఉంటారని సాధించాల్సింది మనం అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.ప్రభాస్ శ్రీను ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ శ్రీను రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ప్రభాస్ కు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.