ప్రాణాలు రిస్క్ లో పెట్టలేనంటున్న ప్రభాస్..?

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాల కే పరిమితమైన ప్రభాస్.

 Prabhas Says Lives Cannot Be Put At Risk, Prabahas, Tollywood, Adi Purush, Salar-TeluguStop.com

ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్‘ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‘ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక మరో స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు .లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా 30 శాతం పూర్తవగా.ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రాణాలు రిస్క్ పెట్టనన్నాడు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ వాయిదా పడగా.ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా కూడా వాయిదా పడింది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొన్ని జాగ్రత్తలతో చేయాలని ప్రభుత్వం కు రిక్వెస్ట్ చేయగా.అది వర్కౌట్ కాక వాయిదా పడింది.

దీంతో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం అందరి ప్రాణాలు రిస్క్ లో పెట్టలేను అంటున్నాడు.అంతేకాకుండా కొన్ని రోజుల వరకు ఈ సినిమా వాయిదా వేయడానికి నిర్మాతలను కూడా ఒప్పించాడట ప్రభాస్.

ఇదివరకే ముంబైలో ఈ సినిమా షూటింగ్ చేయాలనుకోగా.అక్కడ కూడా లాక్ డౌన్ ఉండటంతో అక్కడ కూడా వాయిదా పడింది.

తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ చెయ్యాలని అనుకోగా ఇక్కడ కూడా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube