గుడివాడ అమర్నాథ్ , రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కామెంట్స్ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటున్నాము.రాష్ట్రంలో పోర్ట్ లు అభివృద్ధి జరుగుతోంది.
భావనపాడు, రామయ్య పట్నం పోర్ట్ లు అభివృద్ధి చేస్తున్నాము.కాకినాడ పోర్ట్ కు మారి టైం బోర్డ్ నుంచి 50 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసాం.
రాష్ట్రం లో 6 ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని వినియోగించుకుని అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తాం.
నక్కపల్లి రాంబిల్లి లో ఆరు వేల ఎకరాలు భూసేకరణకు వెళ్తున్నాం.ఇదే తరహా లో ఓర్వకల్లు లో కూడా పారిశ్రామిక వాడ ల అభివృద్ధి చేస్తున్నాము.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో 18 అంశాల్లో సద్దస్సు జరుగుతుంది ఈ నెల 24, 25,26న,మూడు రోజులు సదస్సు జరుగుతుంది 10 అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ పాల్గొంటోంది.వ్యవసాయ , అధునాతన సాంకేతిక అంశాల్లో పాల్గొంటున్నాము.2800 మంది కి పైగా ప్రముఖులు ఈ దావోస్ సదస్సు లో పాల్గొంటున్నారు.రాష్ట్ర వనరులకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నాము.
గత సదస్సు లు జరిగిన పరిస్థితి కి కోవిడ్ తరవాత జరిగే ఈ సద్దస్సు లో చాలా మార్పు ఉంది.గత ప్రభుత్వాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో చేసిన దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.
దావోస్ లో మన వనరులు, చూపించే ఒక అవకాశం మాత్రమే.మొట్ట మొదటి విదేశీ పర్యటన ఇది.విశాఖ లో ఐటి ని అభివృద్ధి చేసే దిశగా బీచ్ ఐటి ని ప్రమోట్ చేసే దిశగా ఈ సద్దసు లో ప్రస్తావిస్తాం.హైదరాబాద్ అభివృద్ధి వెనుక అందరి కష్టం ఉంది.
ప్రధాన నగరం ఉన్న ప్రాంతాలు అభివృద్ధి జరిగింది.అందుకే మన రాష్ట్రంలో విశాఖ ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాము అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టార్ట్ అప్ ఆలోచనలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాము.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది.ఈ మూడేళ్ళలలో 20 వేల ఐటి ఉద్యోగులు పెరిగాయి.
విశాఖ ను ఈ రాష్ట్రానికి ఒక ఐటి హబ్ గా తీర్చిదిద్దుదాం.
సంస్థ ఖర్చులు తగ్గించుకునే విధానంగా విశాఖ హెచ్ ఎస్ బి సి తరలింది.
ఆప్రదేశంలో మరో ముల్టి నేషనల్ కంపెనీ వచ్చింది.ఇప్పటికే కొన్ని ఇంక్కుబేషన్ సెంటర్స్ ప్రతి నిధులతో మాట్లాడం.
వి ఎం ఆర్ డి ఏ కు చెందిన స్థలాలు, భవనాలు ఇవ్వడానికి చర్చ జరిపాం.తూర్పు నావికా దళంలో పరిధి జాతీయ రక్షణ పరమైన అంశాలున్నాయి.
ఈ రాష్ట్రంలో 90 శాతం ఇళ్లకు అందాల్సిన సాయం అందింది గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం లో అపూర్వ స్పందన కనిపిస్తోంది.పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.
చంద్రబాబు తన వద్ద ఉన్న నల్ల ధనాన్ని ,తెల్లధనం గా మార్చుకోవడానికి దావోస్ పర్యటనలు వాడుకున్నారు.