టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పూజా హెగ్డేను అభిమానించే అభిమానుల సంఖ్య అణువంతైనా తగ్గలేదు.
తాజాగా పూజా హెగ్డే స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ రేంజ్ కు రావడానికి నేను ఎంతగా కష్టపడ్డానో నాకు తెలుసని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
ఈ స్థాయికి రావడం కోసం నా ఇష్టాయిష్టాలను సైతం వదులుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఫ్యామిలీకి దూరంగా గడిపానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.కాకపోతే నేనెప్పుడూ స్టార్ లా ఫీల్ కాలేదని ఆమె కామెంట్లు చేశారు.స్టార్ డమ్ ను నేనెప్పుడూ తలకెక్కించుకోలేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నేను నేలమీదే ఉన్నానని ఆమె తెలిపారు.గతంలో నన్ను ఐరన్ లెగ్ అన్నవాళ్లు ఇప్పుడు నంబర్ వన్ అంటున్నారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.
ఐరన్ లెగ్ అన్న సమయంలో ఎలా స్వీకరించానో నంబర్ వన్ అన్న సమయంలో కూడా అలానే స్వీకరించానని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమా రంగంలో స్టార్ డమ్ అనేది శాశ్వతం కాదని పూజా హెగ్డే పేర్కొన్నారు.అందువల్ల స్టార్ డమ్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.సినిమాలో బాగా యాక్ట్ చేయలేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా తిప్పికొడతారని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
ప్రేక్షకులకు యాక్టింగ్ నచ్చితే కొత్తవాళ్లు స్టార్ స్టేటస్ ను అందుకుంటారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.అందుకే స్టార్ డమ్ లాంటి పదాలకు నేను పెద్దగా వాల్యూ ఇవ్వనని ఆమె కామెంట్లు చేశారు.పూజా హెగ్డే వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.