ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నష్టాల లెక్కలు అవాక్కయ్యేలా ఉన్నాయి

సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెలిసిందే.సినిమా మేకింగ్ సమయంలో అంచనాలు భారీగా నమోదయ్యాయి, అందరిలో ఆసక్తిని రేకెత్తించింది కానీ సినిమా విడుదల తర్వాత తీవ్రంగా నిరాశ పరిచింది.

 Sudheer Babu Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Loss , Aa Ammai Gurinchi Mee-TeluguStop.com

ఆ అమ్మాయి గురించి సరిగా చెప్పలేక పోయారంటూ విమర్శలు వస్తున్నాయి.ఇక సినిమా విడుదల తర్వాత నష్టాలు లెక్కల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.

ఈ సినిమా నిర్మాణంలో సుధీర్ బాబు స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరించాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

దాదాపుగా ఆరు కోట్ల రూపాయలను సుధీర్ బాబు ఈ సినిమా కోసం ఖర్చు చేశాడట.

సినిమా సక్సెస్ అయి లాభాలు వస్తే అప్పుడు తీసుకునే విధంగా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నాడట.సినిమా పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో పాటు భారీగా నష్టాలను మిగిల్చడంతో ఇప్పుడు సుధీర్ బాబు పెట్టిన ఆరు కోట్ల రూపాయలు బూడిదలు పోసిన పన్నీరే అన్నట్లుగా మారి పోయిందట.

ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తన పారితోషికం పోగా తన చేతి లోంచి ఆరు కోట్ల రూపాయలు పోయాయంటూ సుధీర్ బాబు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో కూడా నిర్మాతగా సుధీర్ బాబు ప్రయత్నించాడు, కానీ ఈ స్థాయిలో సుధీర్ బాబు నష్టపోలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ముందు ముందు మరోసారి ఇలాంటి ప్రయోగం చేయకుండా సుధీర్ బాబుకు గట్టి షాక్ అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుధీర్ బాబు మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నాడని కొందరు ట్రోల్స్ చేస్తుంటే.మరి కొందరు ఫ్యామిలీని వినియోగించుకోలేక పోతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube