మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు( Assembly and Parliament elections ) జరగబోతూ ఉండడం తో, ఈ ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.దీనికి తగ్గట్లు గానే ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండోసారి గెలిచి అధికారంలోకి రావాలని వైసిపి చూస్తుండగా, టిడిపి , జనసేన ( TDP, Jana Sena )సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి భావిస్తుంది.అధికార పార్టీ వైసిపి మాత్రం కొత్త ఎత్తుగడలతో పై చేయి సాధించే ప్రయత్నం మొదలు పెట్టింది .దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటున్న వాలంటీర్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తుంది.ఈ మూడు రోజుల్లోనే తమ వైపు జనాల చూపు ఉండే విధంగా చేసుకుంటోంది .

తమకు ఖచ్చితంగా ఓటు వేస్తారు అనే వారిని గుర్తించి , ఆ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేంత వరకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.దీనికి కారణం పోలింగ్ రోజున తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారు అనుకున్న వారు పోలింగ్ కేంద్రాలకు రాకపోతే అది ఆ పార్టీకి ఎక్కువ నష్టం తీసుకొస్తుంది అని, అందుకే ఈ మూడు రోజులు అత్యంత పగడ్బందీగా ఎన్నికలవ్యూహాలను అమలు చేసేందుకు వైసిపి( YCP ) ప్లాన్ చేసుకుంటోంది.ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉన్నారు.వీరికి ఆ యాభై ఇళ్లలోని వారు బాగా పరిచయస్తులు కావడంతో, నియోజకవర్గంలోని వైసీపీ నేతలు అంతా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందట.
ఎమ్మెల్యే అభ్యర్థులు, వాలంటీర్లు , ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే విధంగా ప్లాన్ చేశారు. వాలంటీర్లకు వైసీపీ నేతలు పెద్ద మొత్తంలో సొమ్ములు, బహుమతులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లు ఖరీదైన బహుమతులు ఇస్తూ వారి ద్వారా ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉన్నవారిని గుర్తించి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ సిద్దం చేశారట.

ఇప్పటికే సగం మందికిపైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.వారికి ఉన్న పరిచయాలను ఎన్నికలలో ఉపయోగించుకోవాలని వైసిపి చూస్తోంది.ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు వాలంటీర్లు ప్రతి ఓటర్ ను కలిసి తిరిగి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని, చంద్రబాబు అధికారం లోకి వస్తే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కోత విధిస్తారని, సక్రమంగా మీకు అన్నీ అందాలి అంటే వైసీపీకి ఓటు వేయాలని చెప్పనున్నారట.
వైసీపీ వైపు వారి చూపు ఉండే విధంగా వారికి చెప్పేలా ప్లాన్ చేస్తున్నారట.ఒకవైపు వాలంటీర్లు, మరోవైపు ముఖ్య అనుచరులు కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారట .ఈ ఇద్దరు కలిసి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాల్సి ఉంటుంది