బాబుకు దెబ్బేస్తోన్న సైలెంట్ కిల్ల‌ర్‌

లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చామా లేదా? – ఇది ఓ మూవీ డైలాగ్‌! ఇప్పుడు అక్ష‌రాలా ఈ డైలాగ్‌.జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతోంది! 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పేరుతో పెద్ద ఎత్తున పార్టీని స్థాపించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి దూరంగా ఉన్నాడు.

 Pawan Mega Plan On Chandrababu-TeluguStop.com

అంతేకాకుండా.అప్ప‌టి టీడీపీ, బీజేపీల బంధానికి మ‌రింత క‌ల‌రింగ్ ఇస్తూ.

తాను ప్ర‌చారం చేసి పెట్టాడు.దీంతో రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.

అయితే, ఇప్పుడు ప‌వ‌న్ స్ట్రాట‌జీ మారింది! 2019లో ఎట్టి పరిస్థితిలోనూ జ‌న‌సేన‌ను పొలిటిక‌ల్ ఫీల్డ్‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దింపాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ త‌న మెగా ప్లాన్‌ను చెప్పేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న‌ట్టు చెప్పారు.ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి మూడు స‌భ‌లు నిర్వ‌హించారు.

వాటిలో రెండు రాయ‌ల‌సీమ ప్రాంతంలోను, ఒక‌టి తూర్పులోనూ పెట్టారు.ఈ స‌భ‌ల్లో ఆయ‌న పంథా స్ప‌ష్టంగా తెలిసిపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుపై నేరుగా ఆయ‌న ఎలాంటి విమ‌ర్శ‌ల‌ను చేయ‌క‌పోయినా.బాబుకు భారీ ఎత్తున ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లోనే ఆయ‌న స‌మావేశాలు పెట్ట‌డం, ప‌రోక్షంగా ప్ర‌భుత్వ విధానాల‌పై విరుచుకుప‌డ‌డం, ప్ర‌త్యేక హోదాను పాచిపోయిన ల‌డ్డూల‌తో పోలుస్తూ.

వాటిని బాబు ఎలా తీసుకుంటార‌ని ప్ర‌శ్నించ‌డం తెలిసిందే.

దీంతో.

ప‌వ‌న్ ఉద్దేశం స్ప‌ష్ట‌మై పోయింది.ప్ర‌స్తుతం రాష్ట్రంలో విప‌క్షం వైకాపా గాలి క‌న్నా.

అధికార ప‌క్షం టీడీపీ హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తోంది.అంటే టీడీపీ పెట్టిన ప‌థ‌కాలు కానీ, అమ‌లు చేస్తున్న పెన్ష‌న్‌లు కానీ, నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్న సీఎంగా చంద్ర‌బాబుకు వ‌స్తున్న గుర్తింపు కానీ.

టీడీపీకి రానున్న 2019 ఎన్నిక‌ల్లో పాజిటివ్ ఓటుగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.ఈ క్ర‌మంలో ఈ పాజిటివ్ ఓటును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటే త‌ప్ప అనుకున్న‌ది సాధించ‌డం సాధ్యం కాద‌ని గ్ర‌హించిన ప‌వ‌న్ అందుకు అనుగుణంగా సైలెంట్ కిల్ల‌ర్ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌త్య‌క్షంగా బాబుపై ఆరోప‌ణ‌లు చేస్తే.వైకాపా అధినేత జ‌గ‌న్ మాదిరిగా ప్ర‌జ‌ల్లో ఒకింత నెగిటివ్ థాట్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని గ్ర‌హించారో ఏమో.ఎక్క‌డా బాబును వ్య‌తిరేకించ‌డం లేదు ప‌వ‌న్‌.

అయితే, అదేస‌మ‌యంలో బాబు ప‌రివారం చేస్తున్న అవినీతి, ప్యాకేజీ, ప్రాంతీయ అస‌మాన‌త‌లు, రాజ‌ధాని అభివృద్ధి ఒక్క‌టి చేస్తే చాల‌దు… ఇలా నిర్దిష్ట‌మైన విమ‌ర్శ‌ల‌తో బాబును ఆలోచ‌న‌లో ప‌డేస్తూనే.

ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేలా చేస్తున్నాడు ప‌వ‌న్‌.దీంతో 2019 నాటికి ఈ ధాటి మ‌రింత పెంచాల‌ని, త‌ద్వారా టీడీపీ ఓటు బ్యాంకు త‌న‌వైపు మ‌ళ్లుతుంద‌ని ప‌వ‌న్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే యువ‌త‌ను సైతం ప‌వ‌న్ టార్గెట్ చేశాడు.వీరంతా 2019 నాటికి కొత్త ఓట‌ర్లుగా మార‌తారు కాబ‌ట్టి వారిని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌న వైపు మ‌ళ్లించుకోగ‌లిగితే.

ప‌వ‌ర్ స్టార్ కావ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ఆయ‌న భావిస్తున్నాడు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube