తిరుపతి జిల్లా ఎస్పీకి... సీఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈరోజు ఉదయం తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీ నేత శ్రీ కొట్టేసాయి పై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్ పై( CI Anju Yadav ) తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

 Pawan Kalyan Has Complained Against Ci Anju Yadav To Tirupati District Sp Detail-TeluguStop.com

తిరుపతి విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున యువత స్వాగతం పలకడం జరిగింది.కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్… పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి జనసేన నేత కొట్టేసాయి మరి కొంతమంది జనసైనికులు ప్రయత్నించారు.

ఈ క్రమంలో దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ అంజు యాదవ్ వారికి తెలియజేయడం జరిగింది.అయినప్పటికీ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేయటంతో కొట్టేసాయి( Kottesai ) అనే జనసేన నేతపై అందరూ చూస్తుండగానే సీఐ చెంపలపై కొట్టారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మహిళా సీఐ తీరుపై తీవ్రస్థాయిలో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం పవన్ కళ్యాణ్ దృష్టిదాక వెళ్లడంతో నేడు సదరు మహిళా సీఐ తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube