పవన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉన్నారు.వరుసగా పర్యటనలు బహిరంగ సభలు నిర్వహిస్తూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు.

 Pawan Kalyan Contesting From Bhimavaram Or Gajuwaka,pawan Kalyan,janasena,bhimav-TeluguStop.com

వైసీపీ( YCP )ని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్.ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నారనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

ముఖ్యంగా ఈసారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.? గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాలను అధిగమించేందుకు ఎలాంటి వ్యూహాలను సిద్దం చేసుకున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వనని ఘంటాపథంగా చెబుతున్నా పవన్.అందుకోసం టీడీపీ( TDP) తో కూడా పొత్తుకు సై అంటున్నారు.దాదాపుగా ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఖాయమే అయినప్పటికి.ఇంకా స్పష్టతనివ్వడం లేదు.

Telugu Ap, Bhimavaram, Gajuwaka, Janasena, Pawan Kalyan-Politics

ఇదిలా ఉంచితే పవన్ పోటీ చేసే స్థానాలపై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పలు అయిన పవన్ ఈసారి.ఏ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నాడనేది ఆసక్తికరమైన ప్రశ్న.ఈసారి ఉత్తరాంధ్రలోనే ఏదో ఒక నియోజిక వర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని, అలా కాకుండా రాయలసీమ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా పవన్ ఆలోచిస్తున్నారని, కాదు కాదు మళ్ళీ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజిక వర్గాలలోని మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.

Telugu Ap, Bhimavaram, Gajuwaka, Janasena, Pawan Kalyan-Politics

అయితే వీటిపై దేనిలో కూడా స్పష్టత లేనప్పటికి తాజాగా వారాహి విజయయాత్ర తొలిదశ ముగింపు సభ( Varahi Yatra )లో తను పోటీ చేసే స్థానంపై పవన్ ఒక చిన్న సంకేతం ఇచ్చినట్లే కనిపిస్తోంది.తాను భీమవరంలోనే ఉంటానని, భీమవరాన్ని తన నేలగా భావించనని పవన్ చెప్పుకొచ్చారు.వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తారని ఆశగా ఉన్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా భీమవరం( Bhimavaram ) నుంచే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే కేవలం భీమవరం నియోజికవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తారా లేదా మరో నియోజిక వర్గాన్ని కూడా ఎంచుకుంటారా అనేది చూడాలి.మరి ఈ సారైనా పవన్ కు భీమవరం ప్రజలు విజయాన్ని కట్టబెడతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube