గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతముగా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అన్నారు.సోమవారం ఉదయం ఆమె పట్టణంలోనే ఆరో వార్డు ఎన్టీఆర్ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వార్డులో గత మూడు సంవత్సరాలలో పది కోట్ల 50 లక్షల సంక్షేమ పధకాలు అందటం అభినందనీయమన్నారు.
ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలను తెలుసుకొని వాటిని అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు వార్డు కౌన్సిలర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
.