పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య.. పాప పేరు ఏంటంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ ( Manchu Manoj )అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు.మంచు మనోజ్ కుటుంబంలోకి మరో కొత్త మెంబర్ యాడ్ అయ్యారు.

 One More Good News To Manchu Manoj Fans Details Here Goes Viral In Social Media-TeluguStop.com

మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.మనోజ్ దంపతులకు ఆడపిల్ల( girl ) పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

గతేడాది మనోజ్, మౌనిక( Manoj, Maunika ) దంపతులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇద్దరికీ ఈ పెళ్లి రెండో పెళ్లి కాగా మౌనికకు ధైరవ్ ( Dhairav )అనే కొడుకు ఉన్నాడు.

అయితే ఈ కొడుకును మనోజ్ సొంత కొడుకులా చూసుకుంటున్నారు.కొన్ని నెలల క్రితం మౌనిక ప్రెగ్నెన్సీకి సంబంధించిన తీపికబురును వెల్లడించారు.మౌనిక సీమంతం ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) తన పోస్ట్ లో పాపకు ఎం.ఎం.పులి( MM Puli ) అనే ముద్దు పేరు పెట్టినట్టు వెల్లడించారు.ధైరవ్ కు చెల్లెలు వచ్చేసిందని మంచు లక్ష్మి తన పోస్ట్ లో పేర్కొన్నారు.అయితే చిన్నారికి సంబంధించిన ఫోటోలను మాత్రం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదు.

మనోజ్ దంపతులకు కూతురు పుట్టడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.మనోజ్ దంపతుల కూతురుకు శివుడి ఆశీస్సులు ఉండాలంటూ మంచు లక్ష్మి పేర్కొన్నారు.

మంచు మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈటీవీ విన్ ఓటీటీ కోసం మనోజ్ ఒక టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది.మనోజ్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.మనోజ్ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.మల్టీస్టారర్ సినిమాలలో సైతం మంచు మనోజ్ నటిస్తున్నారు.ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube