Sr Ntr :నేనే హీరో అంటే నేనే హీరో అంటూ ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు లు ఎందుకు గొడవ పెట్టుకున్నారు..?

సినిమాల్లో కథని నడిపించేవాడు హీరో కాబట్టి అతడి పాత్ర ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు.హీరో లేకపోతే అసలు సినిమానే ఉండదని చెప్పవచ్చు.

 Ntr And Svr Fight For Hero Role-TeluguStop.com

అయితే కొన్ని సినిమాల్లో హీరోల కంటే ఎక్కువ ప్రాధాన్యత విలన్లకే ఉంటుంది.విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉండటం వల్లనే సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మూవీ బాగా రావడానికి ఆ విలన్ పాత్రలలు ఒక్కోసారి యూజ్‌ అవుతాయి.ఉదాహరణకి రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి.

అంత స్ట్రాంగెస్ట్ విలన్స్ లేకపోతే ఈ సినిమాలు మామూలుగా తయారవుతాయని కూడా చెప్పుకోవచ్చు.

Telugu Reddy, Patala Bhairavi, Tollywood, Villain Role-Movie

దర్శకులు ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా విలన్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.అయితే ఎప్పటికైనా హీరో హీరోనే, విలన్ విలనే, ఒక హీరో అనేవాడు సినిమాలో ఎప్పటికీ విలన్ కాలేడు, అలాగే విలన్ అనే వాడు హీరో కూడా అవ్వలేదు.ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ను డైరెక్టర్లు అలానే రాసుకుంటారు.

సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తర్వాత ఎక్కువ పేరు హీరోకే లభిస్తుంది.విలన్ కి కాదు.

అయితే రెమ్యునరేషన్( Remuneration ) విషయంలో మాత్రం హీరో కంటే విలన్లు ఎక్కువ మనీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

Telugu Reddy, Patala Bhairavi, Tollywood, Villain Role-Movie

70 ఏళ్ల క్రితంకి వెళ్తే, అప్పట్లో పాతాళభైరవి సినిమా( Patala Bhairavi )లో ఎస్వీ రంగారావు నేపాలీ మాంత్రికుడిగా నటించాడు.ఇందులో హీరోగా నటించిన ఎన్టీఆర్ కంటే ఎస్వీ రంగారావే ఎక్కువ పారితోషికం పుచ్చుకున్నాడు.ఈ సినిమాలో విలన్ గా రంగారావు అద్భుతంగా యాక్ట్ చేశాడు.

అతని స్క్రీన్ టైమ్‌ కూడా ఎక్కువే.డైలాగ్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది.

భయంకరంగా నవ్వుతూ ఒక విలన్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత అతనిది.అయితే సినిమా విడుదల సమయానికి ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్ “నేనే హీరో అంటే నేనే హీరో” అనుకుంటూ ఒకరికొకరు వాగ్వాదానికి దిగేవారు.

దర్శకుడు కె.వి.రెడ్డి నిర్మాతలు చక్రపాణి వీళ్ళందరూ కూడా వీరి మధ్య ఈ మాటలను విని కూడా సైలెంట్ గా ఉండేవారు.వారిలో వారు నవ్వుకునే వారు.

కొద్దిరోజుల తర్వాత విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అప్పట్లో ఎన్టీరామారావు కి ఎంత పేరు వచ్చిందో ఎస్వీ రంగారావుకి కూడా దాదాపు అదే స్థాయిలో పేరు వచ్చింది.

మొత్తానికి ఎవరు హీరో అనేది పక్కన పెడితే ఇద్దరూ కూడా ఈ మూవీ తర్వాత కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు.కానీ వారి మధ్య చిచ్చు పెట్టిన నేనే హీరో నేనే హీరో అనే ట్రెండ్ మాత్రం ఇప్పటికీ ఒక మచ్చలాగా నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube