కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రవీందర్ చంద్రశేఖరన్ ( Ravinder Chansrasekharan ) ఒకరు.ఈయన కోలీవుడ్ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం చెన్నైకి చెందిన బాలాజీ( Balaji ) అనే వ్యక్తిని నమ్మించి రవీందర్ మోసం చేసి తన నుంచి దాదాపు 16 కోట్ల రూపాయలు తీసుకున్నారని అయితే వాటిని తిరిగి చెల్లించమంటే చెల్లించకపోగా తనని బెదిరిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిర్మాత రవీందర్ ను అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే.ఈయన జైలులో ఉండగా తన భార్య మహాలక్ష్మి పై ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి.
జైల్లో ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారని తాను డబ్బు చూసే పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు కూడా వచ్చాయి.
తన గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలను మహాలక్ష్మి ఎక్కడ ఖండించలేదు అయితే తాజాగా రవీందర్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు.ఇలా బెయిల్ పై విడుదల అయినటువంటి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను ఎవరిని మోసం చేయలేదని నాపై కేసు పెట్టినటువంటి వ్యక్తి అక్రమాలు దొంగతనాలు నాకు తెలియడంతోనే కేసులు పెట్టారు అంటూ తెలియజేశా.రు.ఇలా నన్ను అన్యాయంగా జైలుకు పంపించిన ఆ వ్యక్తిని అసలు వదిలిపెట్టను అంటూ ఈయన తెలియజేశారు.
ఇక తాను జైలుకు వెళ్లినప్పుడు మహాలక్ష్మి ( Mahalakshmi ) పట్ల తన పట్ల ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయం గురించి కూడా రవీందర్ మాట్లాడుతూ.నాకు మా అమ్మంటే చాలా ఇష్టం ఆమె తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి వారిలో మహాలక్ష్మి కూడా ఒకరు మహాలక్ష్మి భార్యగా రావడం నాకు దొరికిన ఒక వరం.నా గురించి ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసిన ఎంత తిట్టినా మేము అసలు పట్టించుకోమని మమ్మల్నిద్దర్నీ కూడా ఎవరు వేరు చేయలేరు అంటూ ఈ సందర్భంగా తమ ఇద్దరి గురించి వస్తున్నటువంటి విమర్శల పై మరొకసారి రవీందర్ స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.