విడుదల విషయాన్ని మరోసారి కన్ఫర్మ్‌ చేసిన పుష్ప టీమ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతుంది.ఆ విషయం లో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

 No Change In Pushpa Movie Release Date , Allu Arjun, Pushpa, Pushpa Movie Releas-TeluguStop.com

ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పుకార్ల కు చెక్‌ పెడుతున్నారు.ఇప్పటికే ఆగస్టులో సినిమా విడుదల అన్నారు.

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌ ఆగిపోయింది.ప్రస్తుతం సినిమా చిత్రీకరణ కు సాధ్యం కావడం లేదు కనుక ఆగస్టులో విడుదల అవ్వక పోవచ్చు అంటూ కొందరు పుకార్లు షికార్లు చేస్తున్నారు.

దాంతో బన్నీ ఫ్యాన్స్‌ ఈ విషయంలో కొంత గందరగోళంకు గురి అవుతున్నారు.ఈ నేపథ్యంలో పుష్ప టీమ్‌ నుండి మరో సారి క్లారిటీ వచ్చింది.

అల్లు అర్జున్‌ చిత్రీకరణ లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాడని అతి త్వరలోనే సినిమా చిత్రీకరణ పునః ప్రారంభించి ఆ వెంటనే చిత్రీకరణ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.నెల రోజుల గ్యాప్ దొరికితే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తారట.

ఆ వెంటనే పుష్ప విడుదల కు ఏర్పాట్లు చేస్తున్నారు.కరోనా లాక్ డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో షూటింగ్‌ ను పునః ప్రారంభిస్తారట ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టనున్నట్లుగా సుకుమార్‌ టీమ్‌ మెంబర్స్ నుండి క్లారిటీ ఇచ్చారు.

ఆగస్టులో సినిమా విడుదలకు థియేటర్ల వద్ద అనుకూల పరిస్థితి ఉంటే ఖచ్చితంగా సినిమా ను విడుదల చేస్తామని వారు అంఉటన్నారు.సినిమా వసూళ్ల విషయమై ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటున్నారు.

 రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా లో మలయాళ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube