కేసీఆర్‌కు నితిన్ పెండ్లిపిలుపు

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టాడు ఈ హీరో.

 Nithin Invites Kcr For His Marriage, Nithin, Kcr, Nithin Marriage, Shalini Reddy-TeluguStop.com

ఇక ప్రొఫెషన్‌గా సెటిల్ అయిన ఈ హీరో, పర్సనల్ లైఫ్‌లోనూ సెటిల్ అయ్యేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే షాలిని రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం కూడా చేసుకున్న నితిన్, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు.

కాగా ఇప్పటికే పెళ్లి కూడా జరగాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా నితిన్ పలుమార్లు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

తాజాగా శ్రావణమాసం మొదలవడంతో నితిన్ పెళ్లికి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో చాలా సింపుల్‌గా ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు నితిన్, షాలిని రెడ్డిల వివాహం జరగనుంది.కాగా తాజాగా తన వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నితిన్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు.

నితిన్ వివాహం గురించి తెలుసుకున్న కేసీఆర్ అతడికి శుభాకాంక్షలు తెలిపారు.ఇక టాలీవుడ్‌కు చెందిన కొందరిని మాత్రమే ఆహ్వానించాలని నితిన్ భావిస్తున్నాడు.మరి నితిన్ వివాహ వేడుకకు ఎవరెవరు హాజరవుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇక నితిన్ వివాహంతో అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన చిన్ననాటి స్నేహితురాలైన షాలినిని నితిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube