తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నిఖిల్( Nikhil Siddhartha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మొదట హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్ ఇప్పుడు స్వయంభూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ టీడీపీ పార్టీ లో చేరారు.ఈ మేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఇక నిఖిల్ చేరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్ కి టీడీపీ చీరాల టికెట్ కేటాయించింది.
దీంతో నిఖిల్ కూడా ఈ మేరకు ట్వీట్ చేసి తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.
నిఖిల్ టీడీపీలో చేరలేదని, కేవలం ఆయనకు సపోర్ట్ గా మాత్రమే అక్కడికి వెళ్లారని ఆయన టీం వెల్లడించింది.ఇక 2019లో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు.కర్నూల్ జిల్లా డోన్‌లో టీడీపీ తరుపున ప్రచారం చేసి టీడీపీకి ఓటు గుద్దండంటూ చంద్రబాబు( Chandrababu ) స్టైల్‌లో రెండు వేళ్లూ చూపిస్తూ ఒక రేంజ్‌లో ఆయన ప్రచారం చేశారు.అయితే ఆ తరువాత నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అంటూ ప్రచారం చేస్తున్నారు.
అవన్నీ చెత్త వార్తలు.వాటిని నమ్మొద్దు, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని పేర్కొన్నారు.
మంచి వాళ్లు ఎక్కడ ఉన్నా ఒక యాక్టర్ గా కాకుండా యంగ్ ఇండియన్‌గా నా వంతు కృషి చేస్తాను.డోన్ అభ్యర్ధి మా ఫ్యామిలీ మెంబర్ అందుకే సపోర్ట్ చేస్తున్నా అంటూ అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు నిఖిల్.