సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు తెలుగులో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మలయాళం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ ఒక వెలుగు వెలిగారు.
చిన్న పాత్రలో నటించినా మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి సక్సెస్ ను సొంతం చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి.అయితే వరుస ఫ్లాపులతో మోహన్ లాల్ కెరీర్ ప్రస్తుతం అంచనాలకు భిన్నంగా ఉంది.
మలయాళంలో ఈ హీరో నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు.మోహన్ లాల్ కథల ఎంపికలో తడబడుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
గతేడాది మాన్ స్టర్ సినిమాతో మోహన్ లాల్ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవడం లేదు.
దృశ్యం2 సినిమా వరకు వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో అలోన్ అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లు కేవలం 45 లక్షల రూపాయలు అంటే ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనే ప్రశ్నకు సులువుగా సమాధానం దొరుకుతుంది.
మోహన్ లాల్ మార్కెట్ తగ్గడంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మోహన్ లాల్ నాసిరకం కథలను ఎంచుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.మోహన్ లాల్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.మోహన్ లాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నటుడిగా మోహన్ లాల్ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.మోహన్ లాల్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.