నీతి అయోగ్ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నీతి మంతమేనా ?

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యెక హోదా విషయమై ప్రధాని మోడీ స్వయంగా నీతి అయోగ్ కి ఆదేశాలు ఇచ్చి చాలాకాలం అవుతోంది.ఈ వార్త చదివిందే చదివి జనాలు విసుగెత్తి పోయారు కూడా.

 Neethi Ayog – Ap Special Status-TeluguStop.com

ఏపే లో ప్రత్యెక హోదా కోసం ఆత్మబలిదనాలు కూడా జరిగిన తరుణంలో మోడీ మీద ఒత్తిడి పెరిగి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ తరవాత కొన్నాళ్ళ కి ఈ ప్రత్యేక హోదా అంశం త్వరగానే చల్లారిపోయింది.

ప్రతిపక్షం ఎంతగా ప్రశ్నించినా, ‘కేంద్రం నీతి అయోగ్‌కి పని అప్పగించింది.నీతి అయోగ్‌నివేదిక రావాల్సి వుంది.’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం సమాధానం చెబుతూ వచ్చింది.ఏపీ ప్రత్యేక హోదా ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు కావాల్సిందే అంటూ రాష్ట్ర విభజన సమయంలో గొడవ చేసిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆ పేరు ఎత్తట్లేదు.

ఇంతకీ విషయం ఏంటంటే నీతి అయోగ్ ఇప్పుడు ఏపీ లో పర్యటన చెయ్యబోతోంది.తాత్కాలిక రాజధాని విజయవాడ కి నీతి అయోగ్ అధికారులు రాబోతున్నారు.నీతి అయోగ్ బృందం చిత్రంగా పట్టిసీమ ప్రాజెక్టు కి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి కూడా పెట్టింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా నీతి అయోగ్‌వాకబు చేస్తుందట.

పోలవరం కుడి కాలువ పనుల్ని పరిశీలిస్తుందట.ప్రత్యేక హోదా తో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా లేదా అనే ఉద్దేశ్యం విషయంలో కేంద్రానికి నివేదిక ఇవ్వడం మాత్రమే నీతి అయోగ్ పని.చూస్తుంటే నీతి అయోగ్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నాటకానికి తెరలేపాయి అన్నట్టు తోస్తోంది.తూతూ మంత్రంగా వారి పర్యటన సాగకుండా నిజాయతీగా ఏపీ కి ఎదో మంచి చెయ్యాలని పర్యటిస్తే అందరికీ మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube