చిరు మూవీకి నయన్‌ డిమాండ్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్దం అవుతోంది.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘కత్తి’నే చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నాడు.

 Nayanatara To Romance With Chiranjeevi-TeluguStop.com

ఈ నేపథ్యంలో హీరోయిన్‌ను కొత్త వారిని ఎలా ఊహిస్తాం.అంతా ఊహించినట్లుగానే చిరంజీవి పాత హీరోయిన్‌తోనే రొమాన్స్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

వినాయక్‌ తాజాగా ఈ చిత్రం కోసం నయనతారను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంలో నటించేందుకు గాను నయనతార భారీ మొత్తంలో పారితోషికంగా అందుకోబోతుంది.

ఈ చిత్రంలో నటించబోతున్నందుకు గాను చిరంజీవి 27 కోట్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అలాగే నయన్‌ కూడా ఈ చిత్రం కోసం 2.3 కోట్లు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

తమిళంలో ఈమె ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా దూసుకు పోతుంది.

దాంతో ఈ అమ్మడిని చిరంజీవి సరసన నటింపజేసేందుకు భారీ స్థాయిలో పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ మరియు లైకా ప్రొడక్షన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతోంది.ఈ చిత్రంతో పాటు నయనతార మరో చిత్రాన్ని వెంకటేష్‌కు జోడీగా నటిస్తోంది.

గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న నయన్‌ ఒకే సారి రెండు చిత్రాలతో మళ్లీ తెలుగులో బిజీ అవ్వబోతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube