అక్కినేని హీరో నాగ చైతన్య( Naga chaitanya ) అనూహ్యంగా సమంత ను ప్రేమిస్తున్నట్లుగా ప్రకటించి పెళ్లి కూడా చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.వీరిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా అనుకున్న వారు కూడా ఆ సమయంలో చాలా మంది ఉన్నారు.
అలాంటి సమయం లో అందరిని ఆశ్చర్యపర్చే విధంగా నాగ చైతన్య సమంత లు పెళ్లి చేసుకున్నారు.చాలా కాలం పాటు వీరిద్దరి ప్రేమ మరియు పెళ్లి విషయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
నాగ చైతన్య మరియు సమంత ఏదో కారణం వల్ల విడి పోయారు.ఇద్దరు కూడా బ్రేకప్ అయిన తర్వాత చాలా కాలం పాటు రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.సోషల్ మీడియాలో వీరి వివాహ బంధం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారు.ఎవరేం అనుకున్నా కూడా మేము విడి పోతున్నాం అన్నట్లుగా ప్రకటించి విడి పోయారు.సోషల్ మీడియా( Social media )లో వీరు విడి పోయిన తర్వాత రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ముఖ్యంగా నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ( Shobhitha dullipalla ) ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇద్దరు కలిసి నటించిన సినిమా లు ఏమీ లేవు.అయినా కూడా ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో కలిసి ఉన్న ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కనుక వీరిద్దరు కచ్చితంగా కలిసే ఉన్నారు.ఇద్దరికి ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అన్నట్లుగా కొందరు బలంగా వాదించారు.కానీ అసలు విషయం ఏంటి అనేది ఇద్దరి లో ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.ప్రేమ గురించి క్లారిటీ ఇవ్వకుండానే అప్పుడే ఇద్దరు బ్రేకప్ అయ్యారు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యం లో శోభిత ప్రస్తుతం నాగ చైతన్య కు దూరంగా ఉంటుంది.ఇద్దరి మధ్య గ్యాప్ కి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.