Naa Saami Ranga Review : నా సామి రంగ సినిమా రివ్యూ అండ్ రేటింగ్?

సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలలో నా సామి రంగా ( Naa Samiranga ) ఒకటి.విజయ్ బిన్నీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో నాగార్జున( Nagarjuna ) అల్లరి నరేష్ ( Allari Naresh )రాజ్ తరుణ్( Raj Tharun ) వంటి హీరోలు నటించారు ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.ఇక సంక్రాంతికి నాగార్జున సినిమా వచ్చింది అంటే తప్పకుండా హిట్ అందుకుంటుంది అనే సెంటిమెంట్ ఉంది అయితే మొదటిసారి ఈయన రీమేక్ సినిమా ద్వారా సంక్రాంతి పండుగ బరిలో దిగారు మరి ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి సక్సెస్ అందించింది అనే విషయానికి వస్తే.

 Na Sami Ranga Movie Review And Rating-TeluguStop.com

కథ:

తమ్ముడు లాంటి అంజి (నరేష్), తండ్రి లాంటి ఊరిపెద్ద (నాజర్)కి అండగా నిలిచిన మొనగాడు కిష్టయ్య (నాగార్జున). సొంత కొడుకు కంటే కూడా కిష్టయ్యనే తన తండ్రి ఎక్కువగా చూసుకోవడంతోతట్టుకోలేకపోతారు దాసు (షబ్బీర్) అండ్ బ్రదర్స్.ఈ అంతర్యుద్ధం తారా స్థాయికి చేరుకొని చంపుకోవడాల వరకూ వెళ్తుంది.

ఈ కథలో వరాలు (ఆషికా రంగనాధ్) పాత్ర ఏమిటి? తనను చంపేయాలి అని చూస్తున్నటువంటి ప్రత్యర్థుల నుంచి కిట్టయ్య ఎలా తప్పించుకున్నారు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Telugu Keeravani, Na Sami Ranga, Nagarjuna, Raj Tharun, Review, Tollywood, Vijay

నటీనటుల నటన:

నాగార్జున గోదారి యాసలో మాట్లాడుతూ పంచ కట్టులో ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.ఇక్కడ నరేష్ సన్నివేశాలు ప్రేక్షకులను కొన్నిసార్లు కూడా తెప్పించాయి అంజి గాడి పాత్రలో నరేష్( Allari Naresh ) ఒదిగిపోయినటించారు ఇక రాస్తారు పెద్దగా ఎలివేట్ కాలేదని చెప్పాలి.నటి ఆశికా రంగనాథ్ వయసుకు మించినటువంటి పాత్రలో నటించారనే చెప్పాలి.ఇక హీరోయిన్ల పాత్రలకు కూడా వారు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్

: దర్శకుడు విజయ్ బిన్ని కొత్త దర్శకుడు అనే విధంగా కాకుండా చాలా అనుభవం ఉన్నటువంటి దర్శకుడిగా స్క్రీన్ ప్లే చూపించారు ఇక కీరవాణి మ్యూజిక్ మంచి సక్సెస్ అయిందని చెప్పాలి.దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.

Telugu Keeravani, Na Sami Ranga, Nagarjuna, Raj Tharun, Review, Tollywood, Vijay

విశ్లేషణ:

పండగ వాతావరణంతోపాటు రూరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాగా నా సామి రంగ సినిమా ఉంది అని చెప్పాలి.నాగార్జున ఘోస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత సంక్రాంతి పండుగకు ఈ సినిమాకు మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి పండగ పూట ప్రేక్షకులకు కావలసిన మాస్ యాక్షన్ సినిమాని డైరెక్టర్ ప్రేక్షకులకు అందించారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

: నాగార్జున నరేష్ నటన స్క్రీన్ ప్లే కీరవాణి( Keeravani ) మ్యూజిక్.

Telugu Keeravani, Na Sami Ranga, Nagarjuna, Raj Tharun, Review, Tollywood, Vijay

మైనస్ పాయింట్స్:

రాజ్ తరుణ్ పాత్ర, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీత.

బాటమ్ లైన్

: ఇలాంటి తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ నా సామి రంగ సినిమా మాత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube